తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి.ఇక వచ్చిన అవకాశాలను కూడా బాగా వాడుకుంటూ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇక ఇలాంటి వాళ్లలో సుకుమార్ ఒకరు.నిజానికి సుకుమార్ లాంటి డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఇక భారీ విజయాన్ని అందుకున్నాడు.
ఇక సుకుమార్ ( Sukumar )లాంటి డైరెక్టర్ మన ఇండస్ట్రీ లో ఉండటం తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.
లాజిక్స్ తో సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ గా నిలపడంలో ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరు అనేది మాత్రం వాస్తవం.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశంతో అయితే తెరమీద చూపిస్తూ ఉంటాడు.ఇక ఇలాంటి సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ ( Allu Arjun )తో పుష్ప 2 అనే సినిమా చేస్తున్నాడు.
పుష్ప సినిమాకి మంచి గుర్తింపు రావడంతో సుకుమార్ ఈ సినిమాకి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు.ఇక భారీ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను కూడా భారీ సక్సెస్ గా నిలుపుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక మొత్తానికైతే సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ భారీ సినిమాలను చేయడమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నాడనే చెప్పాలి…
అయితే ఇలాంటి సుకుమార్ కి జగడం సినిమా సమయంలో ఆ సినిమా ప్రొడ్యూసర్ తో కొద్దిపాటి గొడవలు జరిగాయనే విషయం అప్పటికి ఒక పెను సంచలనాన్ని సృష్టించింది.ఇక ఈ గొడవకు దిల్ రాజు వచ్చి ఒక పరిష్కారాన్ని చూపించారట.ఇక ఏది ఏమైనప్పటికీ సుకుమార్ కి మొదటి అవకాశాన్ని ఇచ్చిన దిల్ రాజు ఆయన వివాదంలో చిక్కుకున్నప్పుడు కూడా తనని వివాదం నుంచి బయటికి తీసుకురావడం ఒక మంచి విషయం అనే చెప్పాలి…
.