తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్( Allu Arjun) కి స్టార్ హీరోగా చాలా మంచి క్రేజ్ ఉంది.ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఆయన ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో చాలా బిజీగా కొనసాగుతున్నాడు.
ఇక ఇలాంటి సందర్భంలోనే నెక్స్ట్ టైం ఆయన ఎలాంటి సినిమా చేయాలనే దాని మీద చాలా వరకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఆయన చేసిన ఈ సినిమాలన్నీ కూడా తనకు ఒక భారీ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టాయి.
ఇక మీదట ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేదే ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారింది.ఇక అట్లీ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా అల్లు అర్జున్ కి హ్యాండ్ ఇచ్చాడు.
ఇక ఇప్పుడు అల్లు అర్జున్ త్రివికంతో సినిమా చేస్తాడా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు.
మరి ఇలాంటి సందర్భంలో ప్రశాంత్ నీల్ తో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత సినిమా ప్రభాస్ తో సలార్ 2( Salaar 2 ) సినిమా చేస్తాడు.
ఇక అప్పటివరకు అల్లు అర్జున్ సినిమాలు ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా ఫినిష్ చేసి ఈ సినిమా కోసం రెడీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది.మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా కూడా డార్క్ మోడ్ లోనే ఉండబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి…
ఇక మొత్తానికైతే ప్రస్తుతం చేస్తున్న పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రావాల్సింది.కానీ సినిమా షూటింగ్ పూర్తి అవ్వకపోవడం వల్ల దీనిని డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు.
మరి ఇప్పుడు అనుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పాన్ ఇండియా లో 1000 కోట్లకు పైన కలెక్షన్లు వసూలు చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.