వైజాగ్ స్టీల్ ప్లాంట్( Vizag Steel Plant ) ను ప్రైవేటికరించే అంశంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో, దీనిపై ఏం చేయాలనే విషయంపై చాలా రోజులుగా తర్జన భర్జన జరుగుతోంది.ఈ విషయంలో కేంద్రం నిర్ణయం ఏమిటి అనేది క్లారిటీ లేకపోవడంతో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందా లేదా అనే విషయంలో ఒక స్పష్టత లేదు.ఈ నేపథ్యంలోనే నేడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంపై ఢిల్లీలో కీలక సమీక్ష జరగనుంది.‘ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరింకాకుండా ప్రధాని ఒప్పిస్తాం అంటూ జూలై 11న స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ( Kumaraswamy )హామీ ఇచ్చారు. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టిస్తామని కార్మిక , ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు.అయితే ఆ తరువాత ముడి సరుకు సమస్యతో ప్లాంట్ కు అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ప్లాంట్ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల అలవెన్ లో కోత విధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.గత పదేళ్ళుగా పదోన్నతులు లేకపోవడం, ఇప్పటికీ 2007 స్కేల్ ప్రకారం జీతాలు తీసుకుంటున్నామని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, ప్లాంట్ పరిస్థితి 15 రోజుల్లోగా మెరుగుపడేలా చూడాలని సిఎండి అతుల్ బట్ కి కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న సందీప్ ( Sandeep )ఆదేశాలు ఇచ్చారు.అయితే రకరకాల కారణాలతో ముడి సరుకు నిర్వహణలో యాజమాన్యం విఫలం కావడంతో పాటు, ప్లాంట్ పరిస్థితి మరింతగా దిగజారడంతో సెలవుపై వెళ్లాలని కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి సీఎండికి ఆదేశాలు వచ్చాయి.
అతుల్ బట్ నవంబర్ 30న పదవి విరమణ చేయనున్నారు .అప్పటి వరకు సెలవు పై వెళ్ళాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయి.
ప్రస్తుత ప్రాజెక్టు డైరెక్టర్ అరుణ్ క్రాంతి బాగ్చి కి( Director Arun Kranti Bagchi ) బాధ్యతలను అప్పగించారు.సెప్టెంబర్ 9 నుంచి నవంబర్ 30 వరకు ఈ అదనపు బాధ్యతలలో బాగ్చి కొనసాగుతారు.విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఉక్కు శాఖామంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఈరోజు సమీక్ష నిర్వహిస్తోంది.దీంతో స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ కీలక నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది .ఇది ఇలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేతీకరణ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.1300 రోజులుగా దీక్షలు , పోరాటాలు చేస్తున్నారు .స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వాలు స్పందించకపోవడం పై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.నిన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్థానిక కూర్మన్నపాలెం కూడలిలో వందల మంది కార్మికులు రాస్తారోకో నిర్వహించారు.