సర్వసాధారణంగా వేధించే చర్మ సమస్యల్లో మొటిమలు( Acne ) ముందు వరుసలో ఉంటాయి.అయితే మొటిమలు కొందరికి చాలా త్వరగా తగ్గిపోతాయి.
కానీ కొందరికి మాత్రం నాలుగైదు రోజుల వరకు తగ్గవు.ఇంకొందరికి మొటిమలు మచ్చలుగా మారుతుంటాయి.
ఈ మచ్చలు ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.అలాగే ఈ మచ్చలు కారణంగా చాలా మంది మానసిక వేదనకు గురవుతుంటారు.
ఈ మచ్చలను ఎలా వదిలించుకోవాలో తెలియక తెగ మదన పడుతూ ఉంటారు.అయితే అస్సలు వర్రీ అవ్వకండి.
ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే మొటిమలు తాలూకు మచ్చలకు( Pimples ) చాలా సులభంగా బై బై చెప్పవచ్చు.మరి ఇంకెందుకు లేటు ఆ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న టమాటో ని( Tomato ) తీసుకుని వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక బంగాళదుంప ని( Potato ) కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, టమాటో ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ మిశ్రమం నుంచి స్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నీరు తొలగించిన పెరుగును( Curd ) వేసుకోవాలి.అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు పొటాటో-టమాటో జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె వేసుకొని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి.పది నిమిషాల పాటు చర్మాన్ని ఆరనిచ్చి.అనంతరం వేళ్ళతో ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మసాజ్ చేసుకున్న అనంతరం గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా కనుక చేస్తే మొటిమలు తాలూకు మచ్చలే కాదు ఏ మచ్చలు ఉన్నా సరే దెబ్బకు మాయం అవుతాయి.క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
కాబట్టి మొటిమలు తాలూకు మచ్చలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.బెస్ట్ రిసల్ట్ మీ సొంతం అవుతుంది.