మెగా డాటర్ నిహారిక( Niharika Konidela ) నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోగా నిర్మాతగా కూడా ఆమె సత్తా చాటుతున్నారు. కమిటీ కుర్రోళ్లు సినిమాతో నిర్మాతగా భారీ హిట్ ను నిహారిక ఖాతాలో వేసుకోగా ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
అకీరా నందన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఛాన్స్ వస్తే చేస్తారా అనే ప్రశ్నకు నిహారిక స్పందిస్తూ అకీరా నందన్ చాలా యంగ్ అని నిహారిక అన్నారు.
అసలు అకీరా నందన్( Akira Nandan ) కు ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన ఉందా లేదా అని కూడా నేను అడగలేదని ఆమె పేర్కొన్నారు.ఆ ప్రశ్నకు తెలియదనే నేను సమాధానం చెబుతానని నిహారిక తెలిపారు.నిహారిక కామెంట్లతో అకీరా నందన్ ఎంట్రీ ఇప్పట్లో ఉంటుందా? ఉండదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.రాబోయే రోజుల్లో ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
మరోవైపు నిహారిక మెగా హీరోలతో సినిమాలను నిర్మిస్తారా అనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది.నిహారిక నటిగా కూడా పలు సినిమాల్లో నటిస్తున్నారని తెలుస్తోంది.నిహారిక కెరీర్ ప్లాన్స్ కు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
నిహారిక రెమ్యునరేషన్ పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది.నిహారిక నటిగా, నిర్మాతగా సత్తా చాటడంతో పాటు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
థియేటర్లలో హిట్ గా నిలిచిన కమిటీ కుర్రోళ్లు ఓటీటీలో సైతం హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మెగా హీరోలు సపోర్ట్ చేస్తే మాత్రం నిహారికకు తిరుగుండదని చెప్పవచ్చు.
మెగా డాటర్ నిహారికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.