ఆ క్యారెక్టర్ చాలా చీప్.. అందులో నటించడమే ఆశ్చర్యం..?

1974లో అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao )కి హార్ట్ ఆపరేషన్ అయింది.ఆ తర్వాత అతడు డ్యాన్స్ వేయలేక పోతాడని అందరూ అనుకున్నారు కానీ ఏఎన్నార్‌ అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.1977లో వచ్చిన ఈ ఆలుమగలు సినిమాలో అక్కినేని ఎనర్జిటిక్ స్టెప్పులతో ఒక ఊపు ఊపేసాడు.హాట్ ఆపరేషన్ అయ్యాక చాలామంది అత్యంత జాగ్రత్తగా ఉంటారు డాన్సులు, వ్యాయామాలు చేయడానికి భయపడతారు కానీ ఏఎన్నార్ పెద్ద సాహసమే చేశారని చెప్పుకోవచ్చు.

 How Anr Acted In That Cheap Role , Akkineni Nageswara Rao , Dasara Bullodu , To-TeluguStop.com

దసరాబుల్లోడు , ప్రేమనగర్ సినిమాలలో లాగా ఆయన నాట్యం చేయడం అప్పట్లో పెద్ద సంచలనం.జయమాలినితో పోటాపోటీగా ఏఎన్నార్‌ కాలు కదిపాడు.ఈ సినిమా ప్రేక్షకులకు ముఖ్యంగా ఆడవారికి బాగా నచ్చింది.

Telugu Aalu Magalu, Cheap Role, Dasara Bullodu, Raja Babu, Chalapathi Rao, Tolly

ఆలుమగలు సినిమా( Aalu Magalu ) స్టోరీ విషయానికి వస్తే ఇగోతో ఒకరికి ఒకరు కోట్లాడుకుంటారు.విడిపోతారు.ఆఖరికి వారిని ఎవరో ఒకరు కలుపుతుంటారు.లేదంటే అలా పోట్లాడుకునే వారికే జ్ఞానోదయం అయి కలిసిపోతారు.ఇలాంటి స్టోరీలు ఏంటో చాలా సినిమాలు వచ్చాయి మొట్టమొదటిగా వచ్చిన సినిమా బహుశా ఆలుమగలు మాత్రమే కావచ్చు.ఇది 32 కేంద్రాల్లో విడుదల అయింది.23 కేంద్రాలలో 50 రోజులు ఆడగా, 15 సెంటర్లలో వంద రోజులు ఆడి బ్లాక్‌బస్టర్ హిట్ అయింది.హైదరాబాద్‌( Hyderabad)లో నూన్ షోలు వేసేవారు అక్కడ ఇది 25 డేస్ ఆడింది.

Telugu Aalu Magalu, Cheap Role, Dasara Bullodu, Raja Babu, Chalapathi Rao, Tolly

దీనికి రీమేక్‌గా తమిళం మలయాళం కన్నడ సినిమాలు కూడా వచ్చాయి.అవి నల్లతోరు కుటుంబం (1979), జుదాయి (1980), శుభా మిలన (1987).అన్ని భాషల్లోనూ ఇది హిట్ అయింది.

ఈ సినిమా హిట్ కావడానికి ముఖ్య కారణం తాతినేని చలపతిరావు( T.Chalapathi Rao) అందించిన మ్యూజిక్ ఇందులోని పాటలన్నీ ఎవరు గ్రీన్ హిట్స్ అయ్యాయి.“చిగురేసే మొగ్గేసే సొగసంతా పూత పూసే” పాట చాలామందికి నచ్చింది.ఎరక్కపోయి వచ్చాను ఇరక్కపోయాను పాట కూడా హిట్ అయింది.

సినారె రాసిన “రా రా రా రా రంకే వేసాడమ్మో” కూడా చాలా ఆకట్టుకుంటుంది.ఇది జయమాలిని మీద సాగుతుంది.

ఇందులో జయమాలిని పోటీకి రమ్మని చాలెంజ్ చేస్తుంది.ఆ డాన్స్ పోటీలో జి.నారాయణరావు ఓటమిపాలవుతాడు.ఇక ఇందులో వాణిశ్రీ( Vanisri ) క్యారెక్టర్ మాత్రం బాగా రాసుకున్నారు.

మొదట్లో ఆమె అల్లరి చేస్తుంది.ఊరకూరకే పేచీలు పెడుతూ విసిగిస్తుంది.

ఓవర్ సెల్ఫ్ రెస్పెక్ట్ తో, ఈగో తో సఫర్ అవుతుంది.ఆనాటి సగటు మహిళ లాగా భర్త సన్నిధే ఆడవారికి ఫైనల్ డెస్టినేషన్ అని భావిస్తుంది.

యాక్షన్, గ్లామర్ చూపించే పాత్రలో ఆమె అలవోకగా నటించి మెప్పించింది.ఇందులో రాజబాబు- రమాప్రభలు కూడా నటించారు.

అయితే రాజబాబు క్యారెక్టర్‌ను రచయిత బాలమురుగన్‌ చాలా చీప్ గా రాసుకున్నారని చెప్పవచ్చు.ఆ పాత్రలో ఆయన నటించడమే పెద్ద ఆశ్చర్యం.

సీనియర్ డైరెక్టర్ తాతినేని రామారావు , సీనియర్ నిర్మాత ఏ.వి సుబ్బారావులు కూడా అలాంటి చీపు పాత్ర తీసేయాలని చెప్పకపోవడం గమనార్హం.సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి ఈ చిన్న మిస్టేక్ ని ఎవరూ పట్టించుకోలేదు.దీన్ని యూట్యూబ్ లో చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube