S.V.కృష్ణారెడ్డి( SV Krishna Redd ) దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ కామెడీ ఫిల్మ్ యమలీల (1994) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.ఇందులో ప్రముఖ కమెడియన్ అలీ(Ali ) హీరోగా నటించాడు.
అతడు హీరోగా చేసిన ఫస్ట్ మూవీ ఇదే.అయితే ఇందులో అతని సరసన సహజనటి సౌందర్య నటించాల్సి ఉంది.ఆమె ఈ మూవీలో హీరోయిన్‌గా చేస్తానని చెప్పి అడ్వాన్స్ కూడా తీసుకుంది.కానీ తర్వాత నటించనని చెప్పి ఎస్వీ కృష్ణారెడ్డికి పెద్ద షాక్ ఇచ్చింది.సరిగ్గా 15 రోజుల ముందు ఆమె ఈ బాంబు పేల్చింది.దాంతో ఎస్.వీ కృష్ణారెడ్డి బాగా డిసప్పాయింట్ అయ్యారు.అలాగే ‘ఎందుకు నటించనని చెప్తున్నావు.
కారణం చెప్పమ్మా’ అని ప్రశ్నించారు.

అప్పుడు ఆమె మాట్లాడుతూ “పెద్ద పెద్ద హీరోలందరూ కూడా నేను అలీతో కలిసి నటించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.చాలా డౌట్స్ కలిగిస్తున్నారు.” అని చెప్పిందట.ఈ విషయాన్ని తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.అడ్వాన్స్ తీసుకుని, తర్వాత చేయనని తెగేసి చెప్పినా సౌందర్యం మీద కృష్ణారెడ్డి ఏమాత్రం కోపం చూపించలేదట.“సరే, అమ్మ.తప్పేముంది.
నీకు నీ భవిష్యత్తు ముఖ్యం. ఆ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సిన హక్కు నీకు డెఫినెట్ గా ఉంది.నేను వేరే ఆమెను చూస్తాను అని చెప్పాను.” అని కృష్ణారెడ్డి ఇంటర్వ్యూలో తెలిపాడు.తర్వాత ఆయన ఇంద్రజ( Indraja )ను చూశాడు.ఆమె ముఖంలో మంచిగా ఎక్స్‌ప్రెషన్స్ పలుకుతున్నాయని ఆమెనే హీరోయిన్‌గా ఫైనలైజ్ చేశాడు.ఆమె సెలక్షన్ గురించి మాట్లాడుతూ తాను ఎప్పుడూ హీరోయిన్ ఫిగర్ చూడనని, ముఖంలో కావలసిన భావాలన్నీ చక్కగా పలికితే చాలు సెలెక్ట్ చేసుకుంటానని వెల్లడించాడు.”యమలీల సినిమా( Yamaleela )లో కోట శ్రీనివాసరావు కూడా ఫస్ట్ నటించను అని చెప్పాడు.ఆయన పాత్రను తనికెళ్ల భరణికి ఇచ్చాను.కొద్ది రోజులకి మళ్లీ కోట శ్రీనివాసరావు ఫోన్ చేశాడు.ముందుగా ఆఫర్ చేసిన రోల్ కావాలన్నాడు.కానీ అది తనికెళ్ల భరణికి ఇచ్చేసానని చెప్పాను.ఆయన అడిగారు కాబట్టి ఇన్‌స్పెక్టర్ రంజిత్ రోల్ ఆఫర్ చేశాను.” అని ఎస్ వి కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత కొద్ది రోజులకు సౌందర్య రియలైజ్ అయ్యింది.ఆమె ఫోన్ చేసి “నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్ దాని రెక్టిఫై చేసుకునే ఛాన్స్ నాకు ఇవ్వండి” అని అడిగిందట.దానికి బదులిస్తూ “అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకమ్మా.నీకు నేను అన్నయ్య లాంటి వాడిని.చెప్పమ్మా నీకోసం ఏం చేయాలి అని అడిగాను.అప్పుడు తాను నా సినిమాలో ఒక చిన్న పాత్ర అయినా చేస్తానని చెప్పింది.
ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలో సౌందర్య నటించింది అనే ఒక్క మాట వినిపిస్తే అదే తనకి సంతోషం అని పేర్కొంది.ఎవరి సరసనైనా నటిస్తానని తేల్చి చెప్పింది.
అప్పుడు బాబు మోహన్‌తో నటిస్తావా అంటే బాబు మోహన్ కాదు కదా ఎవరితో అయినా నటిస్తానని చెప్పింది.అలా శుభలగ్నం సినిమాలో “చినుకు చినుకు అందెలతో” పాటలో బాబు మోహన్‌తో కలిసి డాన్స్ చేసింది.” అని ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.