యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )దేవర మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండగా ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది.దాదాపుగా 3 గంటల నిడివితో థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుండగా సెన్సార్ టాక్ సైతం పాజిటివ్ గా ఉండటం గమనార్హం.
దేవర విడుదలకు ముందే ఓవర్సీస్ లో కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది.

సాధారణంగా ఓవర్సీస్ లో మాస్ సినిమాలు భారీగా కలెక్షన్లను సొంతం చేసుకోవని టాక్ ఉంది.అయితే దేవర విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది.రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద తారక్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.

దేవర సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో సైతం పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.సముద్ర తీరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.సముద్రతీరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు చాలా తక్కువనే సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువగానే ప్రాధాన్యత ఉందని సమాచారం అందుతోంది.దేవర సినిమా కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు చేస్తున్నారని భోగట్టా.దేవర సినిమాతో కొరటాల శివ( Koratala Shiva ) ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ట్రైలర్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నా ఆ కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
దేవర అభిమానుల అంచనాలను ఎంతమేర నిలబెట్టుకుంటుందో చూడాలి.దేవర సంచలన రికార్డులను సొంతం చేసుకుంటే అభిమానుల ఆనందానికి అయితే అవధులు ఉండవనే సంగతి తెలిసిందే.