యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఇతర హీరోలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.తారక్ కెరీర్ ప్లానింగ్ గురించి అభిమానులకు సైతం అవగాహన ఉంది.
ఈ ఏడాది దేవర సినిమాతో తారక్ ఫ్యాన్స్ కోరుకునే భారీ సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది.మాస్ ప్రేక్షకులే టార్గెట్ గా కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది.

దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా కోసం ఏడాది కంటే ఎక్కువ సమయం పాటు వర్క్ చేశారు.బన్నీ కోసం సిద్ధం చేసిన కథతోనే కొరటాల శివ దేవర సినిమా(
Devara movie )ను తెరకెక్కించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.మరోవైపు ఈ టైటిల్ కూడా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కోసం రిజిష్టర్ చేయించిన టైటిల్ కాగా రెన్యూవల్ చేయించుకోకపోవడంతో ఈ టైటిల్ ను కొరటాల శివ రిజిష్టర్ చేయించుకున్నారు.

మరోవైపు అనిరుధ్ మ్యూజిక్, బీజీఎం విషయంలో ఒకింత అసంతృప్తితో కొరటాల శివ ఉన్నారని సమాచారం అందుతోంది.కొరటాల శివ కెరీర్ కు ఈ సినిమా ప్లస్ అవుతుందో లేక మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివను ఇంతలా నమ్మారంటే కథలో ఏదో ఒక కీలక అంశం ఉంటుందనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా స్టూడెంట్ నంబర్ 1 విడుదలైన తేదీకే ఈ సినిమా విడుదల కానుండటం గమనార్హం.సెంటిమెంట్ పరంగా కూడా ఈ సినిమా కీలకం కాగా తారక్ కోరుకున్న భారీ హిట్ దేవరతో దక్కుతుందేమో చూడాల్సి ఉంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలను తెరకెక్కించారనే దర్శకనిర్మాతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెమ్యునరేషన్ పరంగా కూడా తారక్ టాప్ లో ఉన్నారు.అయితే కరణ్ జోహార్( Karan Johar ) తాజాగా తారక్ తో బాండింగ్ ఇదే విధంగా కొనసాగనుందని చెప్పడంతో బాలీవుడ్ లో తారక్ మరో మూవీ చేయనున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.