టాలీవుడ్ ఇండస్ట్రీలోని అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో దేవర ఒకటి కాగా ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.దేవర ట్రైలర్( Devara trailer ) నచ్చిందని 50% ప్రేక్షకులు చెబుతుండగా మిగిలిన వాళ్లు మాత్రం ఈ సినిమా ట్రైలర్ తమకు నచ్చలేదని చెబుతున్నారు.300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో దేవర తెరకెక్కగా ఈ సినిమాకు దాదాపుగా 350 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని విడుదలకు ముందే నిర్మాతలు సేఫ్ అయ్యారని తెలుస్తోంది.అయితే దేవర ట్రైలర్ చూసిన ప్రేక్షకులను కథ కథనం విషయంలో ఎన్నో సందేహాలు వేధిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే సినిమా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ రెండు పాత్రలకు సంబంధించి వచ్చే ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని ప్రేక్షకులు ఏమాత్రం ఆ ట్విస్ట్ ను ఊహించే అవకాశం అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పోకిరి సినిమా రేంజ్ లో ఈ సినిమా ట్విస్ట్ ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.
దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా విషయంలో వస్తున్న నెగిటివ్ కామెంట్లను పట్టించుకోవడం లేదని సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులు పాజిటివ్ ఒపీనియన్‌తో థియేటర్ల నుంచి బయటకు రావడం పక్కా అని కొరటాల శివ( Koratala Shiva ) ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతుంది.దర్శకుడు కొరటాల శివకు ఈ సినిమాతో పూర్వ వైభవం రావడం కచ్చితమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
దేవర నుంచి రిలీజ్ కానున్న మరో ట్రైలర్ ప్రేక్షకుల్లో అభిప్రాయాన్ని పూర్తిస్థాయిలో మార్చేయనుందని భోగట్టా.కొంతమంది ఈ సినిమాను ఆచార్య( Acharya )తో పోలుస్తుండగా కావాలని టార్గెట్ చేసేవాళ్లను ఎవరూ ఏం చేయలేరని కామెంట్లు వినిపిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఎన్నో లెక్కలు ఉంటాయని ఈ సినిమా కచ్చితంగా కమర్షియల్ గా ప్రేక్షకులను మెప్పించడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.