దేవర నైజాం,ఆంధ్ర బిజినెస్ లెక్కలు ఇవే... అన్ని కోట్లు వస్తేనే సేఫ్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) త్వరలోనే కొరటాల శివ ( Koratala Shiva )దర్శకత్వంలో నటించిన దేవర సినిమా(Devara Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

 Ntr Devara Movie Pre Release Business In Telugu States Details Goes Viral , Deva-TeluguStop.com

ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ప్రాంతాలలో కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ ( Business ) పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే ఆంధ్ర నైజాం ఏరియాలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకుందని తెలుస్తోంది.

Telugu Andhra, Devara, Janhvi Kapoor, Jr Ntr, Koratla, Nizam, Pre, Telugu-Movie

మరి ఆంధ్ర నైజాం ప్రాంతాలలో ఈ సినిమా బిజినెస్ లెక్కలు ఏంటి అనే విషయానికి వస్తే.ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారుగా 95 కోట్ల రూపాయల మేర జరిగింది.నైజాం హక్కులను సుమారుగా 42 కోట్ల రూపాయలు, ఆంధ్రా, సీడెడ్ కలిపి 53 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమా ఆంధ్ర నైజాం థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత సూర్యదేవరనాగ వంశీ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.

Telugu Andhra, Devara, Janhvi Kapoor, Jr Ntr, Koratla, Nizam, Pre, Telugu-Movie

ఎన్టీఆర్ నటించిన RRR తర్వాత 6 ఏళ్ల అనంతరం ఈ మూవీ రిలీజ్ అవుతుండటంతో ఇలాంటి డిమాండ్ కనిపించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే సుమారు 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడితేనే ఈ సినిమా లాభాల బాటలో పయనిస్తుందని ట్రేడ్ నిపుణుల అభిప్రాయం.ప్రస్తుతం ఈ సినిమా పట్ల ఉన్న అంచనాలను చూస్తే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబడుతుందని తెలుస్తుంది.ఇక ఫస్ట్ షో మంచి టాక్ సొంతం చేసుకుంటే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేమి కాదని చెప్పాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube