దేవర నైజాం,ఆంధ్ర బిజినెస్ లెక్కలు ఇవే… అన్ని కోట్లు వస్తేనే సేఫ్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) త్వరలోనే కొరటాల శివ ( Koratala Shiva )దర్శకత్వంలో నటించిన దేవర సినిమా(Devara Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ప్రాంతాలలో కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ ( Business ) పూర్తి చేసుకుంది.

ఈ క్రమంలోనే ఆంధ్ర నైజాం ఏరియాలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకుందని తెలుస్తోంది.

"""/" / మరి ఆంధ్ర నైజాం ప్రాంతాలలో ఈ సినిమా బిజినెస్ లెక్కలు ఏంటి అనే విషయానికి వస్తే.

ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారుగా 95 కోట్ల రూపాయల మేర జరిగింది.

నైజాం హక్కులను సుమారుగా 42 కోట్ల రూపాయలు, ఆంధ్రా, సీడెడ్ కలిపి 53 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ఆంధ్ర నైజాం థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత సూర్యదేవరనాగ వంశీ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.

"""/" / ఎన్టీఆర్ నటించిన RRR తర్వాత 6 ఏళ్ల అనంతరం ఈ మూవీ రిలీజ్ అవుతుండటంతో ఇలాంటి డిమాండ్ కనిపించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే సుమారు 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడితేనే ఈ సినిమా లాభాల బాటలో పయనిస్తుందని ట్రేడ్ నిపుణుల అభిప్రాయం.

ప్రస్తుతం ఈ సినిమా పట్ల ఉన్న అంచనాలను చూస్తే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబడుతుందని తెలుస్తుంది.

ఇక ఫస్ట్ షో మంచి టాక్ సొంతం చేసుకుంటే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేమి కాదని చెప్పాలి.

 .

దేవర మూవీ సక్సెస్ సాధిస్తే ఎన్టీయార్ కంటే కొరటాల శివ కే ఎక్కువ పేరు వస్తుందా..?