తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రజనీకాంత్… ఎవరికి దక్కని క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా మాస్ లో కూడా మంచి ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న ఏకైక హీరో కూడా రజనీకాంత్ గారే కావడం విశేషం… ఇక తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న రజనీకాంత్ యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ వస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే గత సంవత్సరం వచ్చిన జైలర్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఈయన ఇప్పుడు జైలర్ 2 సినిమాను కూడా పట్టలెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ అనే సినిమా చేస్తున్న రజనీకాంత్ ఈ సినిమాని కంప్లీట్ చేసిన వెంటనే జైలర్ 2 సినిమా మీద ఫోకస్ చేయడానికి కసరత్తులు చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారు అనే దానిమీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.
ఇక జైలర్ సినిమాలో విలన్ గా వినాయకన్ నటించి తన మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.ఇక ఇప్పుడు కూడా అలాంటి ఒక విలన్ కోసమే వెతుకుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక అందులో భాగంగానే లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) డైరెక్షన్లో చేస్తున్న ‘కూలీ ‘ సినిమాలో తెలుగు హీరో అయిన నాగార్జున( Nagarjuna ) విలన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇప్పుడు కూడా ‘జైలర్ 2′) Jailer 2 ) సినిమా కోసం తెలుగులో ఉన్న ఒక స్టార్ హీరోని విలన్ గా తీసుకోబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.అందులో భాగంగానే శ్రీకాంత్ జైలర్ 2 సినిమాలో విలన్ గా నటించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.శ్రీకాంత్( Srikanth ) ఇప్పటికే ‘అఖండ’ సినిమాలో విలన్ గా నటించి తనకంటూ ఒక మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.

విలనిజాన్ని పండించడంలో శ్రీకాంత్ చాలావరకు సక్సెస్ అయ్యాడు.అందుకే రజనీకాంత్ సినిమాలో కూడా తనని విలన్ గా తీసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఇది కనక వర్కౌట్ అయినట్లయితే శ్రీకాంత్ విలన్ గా మంచి పేరు సంపాదించుకుంటాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇప్పటికే ఆయన విలన్ గా నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.
కానీ రజనీకాంత్ సినిమాలో విలన్ గా చేస్తే మాత్రం పాన్ ఇండియాలో ఆయన భారీ క్రేజ్ ను దక్కించుకోవడమే కాకుండా వరుసగా విలన్ పాత్రలను చేసే అవకాశాలు కూడా రావచ్చు అనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి.చూడాలి మరి శ్రీకాంత్ ఆ పాత్రను చేస్తాడా లేదా అనేది…