ఆంధ్రావాలా, శక్తి ఫ్లాప్.. దేవరతో ఎన్టీఆర్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం ఖాయమా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) తన సినీ కెరీర్ లో తండ్రీ కొడుకుల పాత్రల్లో నటించడం కొత్తేం కాదు.ఆంధ్రావాలా, శక్తి సినిమాలో తారక్ తండ్రీ కొడుకుల రోల్స్ లో నటించారు.

 Will Junior Ntr Break These Sentiment Details Inside Goes Viral In Social Media-TeluguStop.com

అయితే ఈ రెండు సినిమాలలో ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్ర చనిపోతుంది.అయితే దేవర సినిమాలో మాత్రం తారక్ అటు తండ్రిగా ఇటు కొడుకుగా ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారు.

దేవర, వర పాత్రల్లో తారక్ ఈ సినిమాలో కనిపించనున్నారు.

దేవర పాత్రలో తండ్రిగా వర పాత్రలో కొడుకుగా తారక్ కనిపించనుండగా తారక్ రెండు పాత్రల లుక్స్ అదిరిపోయాయి. తారక్ నుంచి ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా కోరుకునే ప్రేక్షకులకు ఆ ఆకలి తీర్చేలా ఈ సినిమా ఉండనుంది.ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ మాత్రం వావ్ అనేలా ఉంది.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన దేవర సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుండగా అనిరుధ్( Anirudh Ravichander ) ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది.

20 సంవత్సరాల వయస్సులోనే మాస్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన తారక్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ) కూడా రెండు లుక్స్ లో కనిపిస్తున్నారు.దేవర సినిమా ట్రైలర్ గురించి క్రిటిక్స్ నుంచి యూట్యూబ్ రివ్యూవర్ల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.

దేవర మూవీ ట్రైలర్ కట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమా విజువల్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.తప్పు చేయాలని సముద్రంలో అడుగు పెడితే వాళ్లను చంపే పాత్రలో దేవర పాత్ర ఉంది.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలను మించేలా ట్రైలర్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube