ఆంధ్రావాలా, శక్తి ఫ్లాప్.. దేవరతో ఎన్టీఆర్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం ఖాయమా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) తన సినీ కెరీర్ లో తండ్రీ కొడుకుల పాత్రల్లో నటించడం కొత్తేం కాదు.

ఆంధ్రావాలా, శక్తి సినిమాలో తారక్ తండ్రీ కొడుకుల రోల్స్ లో నటించారు.అయితే ఈ రెండు సినిమాలలో ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్ర చనిపోతుంది.

అయితే దేవర సినిమాలో మాత్రం తారక్ అటు తండ్రిగా ఇటు కొడుకుగా ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారు.

దేవర, వర పాత్రల్లో తారక్ ఈ సినిమాలో కనిపించనున్నారు. """/" / దేవర పాత్రలో తండ్రిగా వర పాత్రలో కొడుకుగా తారక్ కనిపించనుండగా తారక్ రెండు పాత్రల లుక్స్ అదిరిపోయాయి.

తారక్ నుంచి ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా కోరుకునే ప్రేక్షకులకు ఆ ఆకలి తీర్చేలా ఈ సినిమా ఉండనుంది.

ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ మాత్రం వావ్ అనేలా ఉంది.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన దేవర సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుండగా అనిరుధ్( Anirudh Ravichander ) ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది.

"""/" / 20 సంవత్సరాల వయస్సులోనే మాస్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన తారక్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సినిమాలో సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ) కూడా రెండు లుక్స్ లో కనిపిస్తున్నారు.

దేవర సినిమా ట్రైలర్ గురించి క్రిటిక్స్ నుంచి యూట్యూబ్ రివ్యూవర్ల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.

దేవర మూవీ ట్రైలర్ కట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమా విజువల్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

తప్పు చేయాలని సముద్రంలో అడుగు పెడితే వాళ్లను చంపే పాత్రలో దేవర పాత్ర ఉంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలను మించేలా ట్రైలర్ ఉంది.

యూకే: కాఫీ షాప్స్‌లో కొత్త రూల్.. ఇకపై అవి యూజ్ చెయ్యలేరు..?