స్కూటీని అత్యంత తెలివిగా దొంగలించిన స్కూల్ గర్ల్.. వీడియో చూస్తే..?

ఈ రోజుల్లో ఎవరినీ నమ్మడానికి లేదు.మంచిగా కనిపించే వాళ్లే దొంగతనాలు చేస్తూ షాక్‌లు ఇస్తున్నారు.

 The School Girl Who Stole The Most Clever Scooty.. If You See The Vide , Viral V-TeluguStop.com

తాజాగా జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు.ఈ సంఘటనలో 13-14 ఏళ్ల వయసున్న ఒక స్కూల్ గర్ల్ ఓ స్కూటీని దొంగతనం చేసింది.

ఆ వయసులో, అది కూడా అమ్మాయి అయి ఉండి, చదువుకుంటూనే ఇలాంటి దొంగతనం చేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ‘ఘర్ కా కలేష్‘ అనే అకౌంట్ ఎక్స్‌ (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసింది.దొంగతనం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి చూపించిన ధైర్యం చూసి ప్రజలు షాక్ అవుతున్నారు.

వారణాసి( Varanasi )లోని భేలుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కబీర్ నగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వైరల్ వీడియోలో ఒక స్కూల్ యూనిఫామ్‌ ( School uniform )వేసుకున్న బాలిక ఓ స్కూటీ ముందుకు వచ్చింది.దాన్ని కొంచెం జరుపుకోవాలని యజమానికి చెప్పింది,, ఆ ఇంట్లో ఉండే ఆంటీని స్కూటీ తాళం ఇవ్వమని అడిగింది.ఆ అమ్మాయి దొంగ అని ఎవరూ అనుకోరు అమాయకంగానే ఉంది కాబట్టి బండిని పక్కకు తిప్పి తన దారిన తాను వెళ్ళిపోతుందేమో అని సదరు ఆంటీ అనుకుంది.

కానీ కొద్ది సేపటికే ఆ అమ్మాయి స్కూటీ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యింది.ఇంత జరిగింది అని తెలిసి ఆంటీకి షాక్ అయ్యింది.ఈ మొత్తం సంఘటన ఒక CCTV కెమెరాలో రికార్డ్ అయింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.అమ్మాయి చాలా ధైర్యంగా కొన్ని సెకన్లలో స్కూటీ దొంగతనం చేసింది అని అంటున్నారు.ఆ వీడియో కింద ఇలా రాశారు: ‘స్కూల్ యూనిఫాం వేసుకున్న ఆ అమ్మాయి ఫ్లాట్‌లో ఉండే ఆంటీ దగ్గరకు వెళ్లి, “స్కూటీ పక్కకు పెడతా, కీస్‌ ఇవ్వండి” అని అడిగింది.ఆంటీ, ఆ అమ్మాయి అమాయకురాలుగా కనిపించింది, పైగా స్కూల్ స్టూడెంట్ అని భావించి స్కూటీ కీ ఇచ్చేసింది.కానీ ఆ అమ్మాయి స్కూటీ తీసుకొని పారిపోయింది.దీనికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి వాటిని చూసి చాలామంది “అమ్మో! ఈ రోజుల్లో ఏంటి దొంగలు ఇలా ఉన్నారు” అని కామెంట్ చేస్తున్నారు.అసలు ఆ అమ్మాయి దొంగ ఏమో, స్కూల్ డ్రెస్ వేసుకొని ప్రజలను మోసగిస్తుందేమో అని అన్నారు.

తెలియని వ్యక్తులను గుడ్డిగా అసలు నమ్మకూడదు అని కామెంట్లు చేస్తున్నారు.దీన్ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube