యంగ్ టైగర్ జూనియర్ పేరు వింటే ఆది, సింహాద్రి సినిమాలు గుర్తుకు వస్తాయనే సంగతి తెలిసిందే.తర్వాత రోజుల్లో తారక్ కొన్ని మాస్ సినిమాలలో నటించినా ఆ సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్యాన్స్ ను మెప్పిస్తే మరికొన్ని సినిమాలు ఫ్యాన్స్ ను మెప్పించే విషయంలో ఫెయిలయ్యాయి.
అయితే దేవర మాత్రం అభిమానుల అంచనాలను మించి ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దేవర సినిమా ట్రైలర్( Devara Trailer) విషయంలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.బిజీఎం మరీ భారీ స్థాయిలో లేదని, ట్రైలర్ ఆచార్య మూవీని గుర్తుకు తెస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ కు ఫ్యాన్స్ సైతం తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు.ఎన్టీఆర్ దేవర ట్రైలర్ అద్భుతంగా ఉన్నా ఓర్వలేక ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేవర సినిమా రికార్డులు బ్రేక్ చేసే సినిమా అని అభిమానులు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.దేవర సినిమా ఇతర భాషల ట్రైలర్లకు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది.
దేవర ట్రైలర్ కు షార్క్ సీక్వెన్స్ హైలెట్ గా నిలవగా ఆ సీక్వెన్స్ కోసం ఒక రోజంతా నీళ్ల ట్యాంక్ లో ఉన్నానని తారక్ పేర్కొన్నారు.ఆ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని తారక్ చెబుతుండటం గమనార్హం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆ( Junior NTR )ర్ దేవర కోసం ఎంతో కష్టపడగా ఈ సినిమాతో ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి.దేవర1 ( Devara1 )బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే సినిమా కావాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతూ దేవరపై అంచనాలను పెంచుతోంది.దేవర సినిమా రిలీజ్ కు ముందే కొన్ని సంచలన రికార్డులను సొంతం చేసుకుంటుండగా రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డులు చేరతాయో చూడాల్సి ఉంది.