కళైవాని రాజారత్నం( Kalaivani Rajaratnam ) అన్న పేరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా.? కలైవాణి రాజారత్నం అలియాస్ తెన్మొళి అలియాస్ ధన.శ్రీలంక లోని జాఫ్నలో కైతడి అనే ఊరిలో 1968 జులై 26 న జన్మించింది.ఆమె తండ్రి రాజారత్నం ఎల్ టీటీఈ (లిబరేషన్ టైగెర్స్ అఫ్ తమిళ్ ఈలం ) వేలుపిళ్లై ప్రభాకరంకి గురువు.
ఎల్ టీటీఈ శ్రీలంకలోని తమిళులకు స్వతంత్ర దేశాన్ని సృష్టించడం కోసం, తమిళులకు సామాజిక, ఆర్ధిక, రాజకీయ హక్కులను కల్పించడం కోసం 1970 లో స్థాపించబడింది.చిన్న వయసులోనే తండ్రిని, అన్నని పోగొట్టుకున్న కలైవాణి చిన్నవయసులోనే ఉద్యమంలో భాగమైంది.
ఉద్యమంలో అంచెలంచలుగా ఎదిగి తెన్మొళిగా మారింది.మన దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ( Rajiv Gandhi ) హత్యలో ప్రధాన పాత్ర పోషించింది.
రాజీవ్ గాంధీని హత్య చేయడానికి మానవబాంబుగా మారి ప్రధాని ప్రాణాలతోపాటు తన ప్రాణాలు కూడా తీసుకుంది.
ఈమె జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం “ది టెర్రరిస్ట్”.
( The Terrorist ) ఈ చిత్రాన్ని ప్రముఖ భారతీయ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ 1998 లో చిత్రీకరించారు.సెన్సార్ కారణంగా చిత్రంలో ఎక్కడ ఎల్ టీటీఈ, రాజీవ్ గాంధీ, గురించి వినిపించకపోయిన ఈ కథ కళైవాని రాజారత్నం జీవితం ఆధారంగా రాసినదే.
ఒక దేశ ప్రధానిని హత్య చేసిన వ్యక్తి జీవితంపై సినిమా అనుకుంటున్నారా.? అదే ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత.

ఈ సినిమాలో దర్శకుడు ఉద్యమం గురించిన విషయాలను పక్కన పెట్టి.కేవలం తన ప్రధాన పాత్ర యొక్క భావోద్వేగాలపై దృష్టి పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర పేరు మల్లి.( Malli ) 19 ఏళ్ల వయసుగల మల్లి, అప్పటివరకు అడవులలో బ్రతికి, ఒక దేశ ప్రధానిని చంపేందుకు మానవబాంబుగా మారి మొట్టమొదటిసారి బయట ప్రపంచంలో అడుగు పెడుతుంది.అదే సమయంలో ఆమె గర్భవతి అని తెలుస్తుంది.ఉద్యమం కోసం తన ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడిన అమ్మాయి, తాను గర్భవతి అని తెలియగానే ఆమె ఆలోచనలు మారిపోతాయి.
అసలు ఈ ప్రపంచంలో చావు ఎందుకు.? ఒకర్నొకరు ఎందుకు చంపుకోవాలి.? ఏ పాపం ఎరుగని తన బిడ్డ ఎందుకు చావాలి? ఇటువంటి ఆలోచనలు, అంతర్మధనాలతో ఆమె చివరకు ఏం చేసింది అనేదే కథ.

ఈ చిత్రంలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవలసింది మల్లి పాత్ర పోషించిన అయేషా దర్కర్( Ayesha Darkar ) గురించి.ఒక మంచి కథను ప్రేక్షకులకు అందంగా, అర్ధమయ్యేలా, గుండెకు హత్తుకునేలా చెప్పాలంటే మంచి నటులు చాలా అవసరం.అటువంటి నటి ఈ చిత్రానికి దొరికింది.
ఆమె అయేషా దర్కర్.ఈ చిత్రంలో ఆమె తన కళ్ళతో పలికించిన భావాలు అందరు తప్పకుండ చూడాల్సిందే.
ఈ చిత్రంలో ఆమె నటనకు గాను కైరో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో “బెస్ట్ ఆర్టిస్టిక్ కాంట్రిబ్యూషన్ బై ఆన్ యాక్ట్రెస్” అవార్డు అందుకున్నారు.అయేషా ఒక బ్రిటిష్ నటి.ఈమె ఔట్సోర్స్డ్, ది ఇండియన్ డాక్టర్, సిటీ అఫ్ జాయ్ వంటి చిత్రాలలో నటించారు.







