తమిళ సినిమాలకు అలా తెలుగు సినిమాలకు ఇలా.. అనిరుధ్ కు ఇది న్యాయమేనా?

సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ( Anirudh Ravichander )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయనకు టాలీవుడ్ బాలీవుడ్ అలాగే కోలివుడ్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Anirudh Gave Special Tunes For The Film, Anirudh, Special Features, Film, Tamil-TeluguStop.com

ముఖ్యంగా ఆయన సంగీతానికి అలాగే ఆయన పాటలకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.మంచి మంచి సంగీతాన్ని మంచి మంచి పాటలను అందిస్తూ భారీగానే అభిమానులను సంపాదించుకున్నారు.

ఇకపోతే తమిళ పాటలకు స్టెప్పులు వేస్తూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా మ్యూజిక్ ని కంపోజ్ చేయడంతో తెలుగు ప్రేక్షకులు అనిరుద్ రవిచందర్ తెలుగు హీరోల సినిమాలకు పనిచేస్తే ఎంత బాగుంటుందో అని చాలా ఆశపడ్డారు.

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మూవీ అజ్ఞాతవాసి సినిమాకి ( Angynathavasi movie )పని చేశాడు కానీ, అంచనాలను అందుకోలేకపోయాడు.

పైగా ఆ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో తనను తప్పుబట్టడానికి ఏమీ లేకపోయింది.ఇక ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమాకు అభిమానుల కోరిక మేరకు అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు.

ప్రేక్షకులు అభిమానుల కోరిక మేరకు కొరటాల శివ కూడా అనిరుద్ నే సంగీత దర్శకుడిగా నియమించుకున్నారు.కానీ అనిరుధ్ ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన మూడు పాటల విషయంలో కంప్లైంట్స్ వచ్చాయి.

పాటల్లో కొత్తదనం లేదని, తమిళంలో ఆల్రెడీ చేసిన పాటల ట్యూన్లనే ఇటు అటు తిప్పి ఇచ్చేశాడని విమర్శలు తప్పలేదు.

Telugu Anirudh, Anirudh Gave, Tamil, Telugu-Movie

దేవర సినిమా ( Devara movie )మొదలైన తర్వాత తమిళంలో వేరే సినిమాలకు మంచి మంచి పాటలు అందించారు అనిరుద్.గత ఏడాది విడుదలైన లియో సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ని ఇచ్చాడు.లేటెస్ట్‌గా వేట్టయాన్ నుంచి లాంచ్ చేసిన మనసిలాయో పాట వెంటనే వైరల్ అయిపోయింది.

ఈ పాటలో అనిరుధ్ మార్క్ స్పష్టంగా కనిపించింది.విడుదలైన ఒక్క రోజు లోపే ఈ పాట బాగా వైరల్ అయిపోయింది.

సోషల్ మీడియాను ఊపేసింది.ఈ పాట విన్నాక అనిరుధ్ తమిళ సినిమాల మీద పెట్టే శ్రద్ధ తెలుగు చిత్రాల మీద పెట్టడనే చర్చ మరోసారి ఊపందుకుంది.

Telugu Anirudh, Anirudh Gave, Tamil, Telugu-Movie

అక్కడి సినిమాలకు ఎంతో కసరత్తు చేసి ప్రత్యేకమైన ట్యూన్లు అందించే అతను, తెలుగు సినిమాలకు మాత్రం మొక్కుబడిగా, కాపీ ట్యూన్లు ఇస్తాడనే అభిప్రాయం ఇంకా బలపడేలా కనిపిస్తోంది.దీంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.తమిళ సినిమాలకు అలా మంచి మంచిగా మ్యూజిక్ ని కంపోజ్ తెలుగు సినిమాల విషయంలో అంత శ్రద్ధ పెట్టకపోవడంతో మండిపడుతున్నారు.మరి ఈ విషయంపై అనిరుధ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube