అరటి పండ్లు.( Bananas ) సీజన్ తో పని లేకుండా ఏడాది పొడవునా లభించే పండ్లలో ఒకటి.
అరటి పండ్లు తక్కువ ధరకే లభించిన ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి.అయితే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే అరటి పండ్లను తినేసి వాటికున్న తొక్కలను డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.
కానీ అరటి పండు తొక్కలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టి జుట్టును ఒత్తుగా పెంచడానికి అరటి పండ్ల తొక్కలు అద్భుతంగా సహాయపడతాయి.

ఇంతకీ అరటి పండు తొక్కలను( Banana Peels ) జుట్టుకు ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల బియ్యం కడిగిన వాటర్ ను పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు అరటి పండు తొక్కలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.
అలాగే ఒక కప్పు ఉల్లి తొక్కలు, రెండు తుంచిన బిర్యానీ ఆకులు, అర కప్పు అలోవెరా ముక్కలు( Aloevera ) వేసి కనీసం పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం కలిపితే అదిరిపోయే హెయిర్ టోనర్( Hair Toner ) సిద్దమవుతుంది.ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.
ఆపై స్కాల్ప్ కు ఒకటికి రెండుసార్లు తయారు చేసుకున్న టోనర్ ను స్ప్రే చేసుకోవాలి.

రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే జుట్టు కుదుళ్లకు చక్కని పోషణ అందుతుంది.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.
హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేయడానికి మరియు హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేయడానికి ఈ టోనర్ గ్రేట్ గా సహాయపడుతుంది.







