వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు( Vande Bharat Express Trains ) ఇండియాలో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.ఇవి కారు లాంటి సౌకర్యాన్ని అందిస్తాయి.
మంచి ఫుడ్ కూడా ఇందులో సర్వ్ చేస్తారు.అన్నీ క్లీన్ చేస్తారు.
బాత్రూం సైతం చాలా నీట్‌గా ఉంటాయి.ఇలాంటివి ఇంకా తీసుకురావాలని భారతీయ ఆ ప్రయాణికులు కోరుకుంటున్నారు కానీ వారి కొంతమంది మాత్రం వాటిలో చెత్త పారేస్తూ లేదంటే వాటికే హాని తల పెడుతూ చాలామంది ఆగ్రహానికి గురవుతున్నారు.
ఇటీవల ఒక యువకుడు చేసిన పని చూసి చాలా మంది కోపంతో ఊగిపోతున్నారు.అతడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కిటికీని ఒక సుత్తితో పగలగొట్టాడు.
ఆ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోను చూసిన వారి సంఖ్య లక్షా నలభై వేలకు చేరుకుంది.
ఈ వీడియోలో ఆ వ్యక్తి తన ముఖాన్ని హైడ్ చేసుకొని కిటికీని పదే పదే కొడుతున్నట్లు కనిపిస్తోంది.
“వందే భారత్ ట్రైన్‌ను సుత్తితో పగలగొట్టిన మిస్టీరియస్ పర్సన్( Mysterious Person ).ఈ సంఘటన ఎక్కడ జరిగిందో, ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా?” అని ఈ వీడియో క్యాప్షన్ లో అడిగారు.ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియక, ప్రజలు చాలా కోపంగా ఉన్నారు.
చాలామంది ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.కొంతమంది ఆ వ్యక్తికి చాలా కఠినమైన శిక్ష పడాలని కోరుతున్నారు.
కొందరు మరణ శిక్ష వేయాలని కూడా కోరుతున్నారు.లేదంటే అందరూ ఇలా ప్రభుత్వ ఆస్తులను నష్టం చేసి ఈజీగా తప్పించుకుంటారని కామెంట్లు చేస్తున్నారు.
అయితే, ప్రజలంతా కోపంగా ఉన్న సమయంలో, ఒక ఎక్స్ యూజర్ భిన్నమైన విషయం చెప్పారు.ఆయన ప్రకారం, ఆ రైలు ప్లాట్‌ఫాం మీద కాకుండా సర్వీస్ సెంటర్‌లో ఉంది.అలాగే, కిటికీ పగలగొట్టిన వ్యక్తి ఒక కాంట్రాక్టర్ మాత్రమే.ఆయన పగిలిపోయిన కిటికీని మార్చే పని చేస్తున్నాడు అని ఆ యూజర్ చెప్పారు.ఇలాంటి వందే భారత్ రైళ్లను ధ్వంసం చేసే సంఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి.ఈ వీడియో గురించి అధికారులు ఇంకా ఏమీ చెప్పలేదు.
కానీ ఈ సంఘటన వల్ల ప్రజా ఆస్తుల భద్రత గురించి మళ్లీ చర్చ జరుగుతోంది.