మద్యం అలవాటు పోవాలా.. అయితే కరక్కాయను ఇలా తీసుకోండి!

ఇటీవల రోజుల్లో మందుబాబుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది మద్యానికి అలవాటు పడుతున్నారు.

 Amazing Health Benefits Of Myrobalan! Myrobalan, Myrobalan Benefits, Health, Hea-TeluguStop.com

బానిస‌లుగా మారుతున్నారు.ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు.

ఒక్కసారి మద్యానికి అలవాటు పడితే దాన్ని వదిలించుకోవడం చాలా క‌ష్టం.ఎంతో కృషి పట్టుదల ఉండాలి.

ఆరోగ్యమైన జీవన శైలికి అలవాటు పడాలి.ఇకపోతే మద్యం అలవాటును పోగొట్టడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.

ముఖ్యంగా కరక్కాయను( Karakkaya ) ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే తాగుడుకు క్ర‌మంగా దూరం అవుతారు.ఆయుర్వేద వైద్యంలో క‌ర‌క్కాయ‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది.క‌ర‌క్కాయ‌లో ఎన్నో పోష‌కాలు మ‌రెన్నో ఔష‌ధ గుణాలు నిండి ఉంటాయి.అందుకే అనేక వ్యాధులు నివార‌ణ‌లో క‌ర‌క్కాయ‌ను ఉప‌యోగిస్తారు.

ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు టీ స్పూన్ కరక్కాయ పొడిని( Karakkaya powder ) కలిపి తీసుకోవాలి.ఈ విధంగా చేస్తే మద్యంపై విరక్తి కలుగుతుంది.

మద్యం అలవాటు పోతుంది.

Telugu Drinkers, Tips, Karakkaya, Latest, Myrobalan-Telugu Health

అలాగే క‌ర‌క్కాయ‌తో మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.అర టీ స్పూన్ క‌ర‌క్కాయ పొడిని వ‌న్ టేబుల్ స్పూన్ స్వ‌చ్ఛ‌మైన తేనెలో( honey ) క‌లిసి తీసుకుంటే క‌డుపు నొప్పి, విరేచ‌నాలు నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.వికారం, వాంతులు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

పైల్స్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారికి కూడా క‌ర‌క్కాయ ఉప‌యోగ‌ప‌డుతుంది.అర టీ స్పూన్ కరక్కాయ పొడికి అర టీ స్పూన్ బెల్లం పొడి ( Jaggery powder )కలిపి భోజనానికి ముందు తీసుకోవాలి.

ఇలా నిత్యం చేస్తే పైల్స్ స‌మ‌స్య త‌గ్గుతుంది.

Telugu Drinkers, Tips, Karakkaya, Latest, Myrobalan-Telugu Health

దగ్గుకు క‌ర‌క్కాయ‌ సహజ నివారణగా పని చేస్తుంది.ద‌గ్గుతో ఇబ్బంది ప‌డుతున్న వారు అర టీ స్పూన్ క‌ర‌క్కాయ పొడిలో చిటికెడు మిరియాల పొడి, చిటికెడు న‌ల్ల ఉప్పు మ‌రియు ఒక టీ స్పూన్ తేనె క‌లిసి తీసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఈ విధంగా క‌ర‌క్కాయ‌ను తీసుకుంటే మొండి ద‌గ్గు అయినా స‌రే పరార్ అవుతుంది.

క‌ఫం క‌రుగుతుంది.శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు తొల‌గిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube