టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల( Pawan Kalyan and Mahesh Babu ) గురించి మనందరికీ తెలిసిందే.ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఆయా హీరోల కొడుకులు సినిమా ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తారా అని ఎంతో చూస్తున్నారు.
కాగా సీనియర్ స్టార్స్ లో చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ ఎంత కిక్ ఇస్తుందో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మధ్య పోటీ అంతే కిక్ ఇస్తుంది.అయితే ప్రస్తుతం పవన్, మహేష్ ల సినిమాలు తగ్గిపోయాయి.
పవన్ ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు.మరోవైపు మహేష్ తన తదుపరి చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడు.

ఆ సినిమా రావడానికి కనీసం రెండు మూడేళ్లు పడుతుంది.ఈ క్రమంలో వీరి వారసుల గురించి చర్చ మొదలైంది.పవన్ తనయుడు అకీరా నందన్,( Akira Nandan ) మహేష్ కుమారుడు గౌతమ్ కృష్ణ( Gautam Krishna ) ఇద్దరి వయసు సుమారుగా 18-20 ఏళ్ళు.వచ్చే ఐదేళ్ళలో వీరిద్దరూ హీరోలుగా ఎంట్రీ ఇచ్చే అవకాశ ఉంది.
అదే జరిగితే ఇప్పుడు పవన్, మహేష్ మధ్య పోటీ ఎంత ఆసక్తికరంగా ఉందో అకీరా, గౌతమ్ మధ్య పోటీ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.ఇప్పటికే లుక్స్ పరంగా తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్న అకీరా, గౌతమ్ హీరోలుగా కూడా పవన్, మహేష్ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటారేమో చూడాలి మరి.

ఇప్పటికే గౌతమ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడంతో పాటు నటన విషయంలో కూడా శిక్షణ తీసుకున్నట్టు తెలుస్తోంది.మరోవైపు అకీరా తనకు ఇష్టమైన పియానో మ్యూజిక్ ని ఇష్టపడి ఆ ప్రొఫెషన్ దిశగానే వెళ్తాడా, లేదంటే హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు కాస్త సందేహంగా ఉన్నారు.ఒకవేళ ఈ ఇద్దరు హీరోల కొడుకులు ఎంట్రీ ఇస్తే ఎవరు ముందుగా ఎంట్రీ ఇస్తారు ఎవరో సక్సెస్ అవుతారు అన్నది తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు వేచి చూడక తప్పదు మరి.