ఈ వరల్డ్ లోనే బెస్ట్ దేశం అది.. మన దేశం ఏ స్థాయిలో ఉందంటే?

ప్రపంచ వ్యాప్తంగా “ది బెస్ట్‌ కంట్రీ”గా స్విట్జర్లాండ్‌ వరుసగా మరోమారు తన పేరుని రికార్డుల్లో లిఖించుకుంది.బెస్ట్‌ కంట్రీస్‌ ర్యాంకింగ్స్‌ 2024లో భాగంగా, యూఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్ విడుదల చేసిన లిస్టులో ముచ్చటగా మూడోసారి టాప్‌ ప్లేస్‌ను సొంతం చేసుకొని స్విట్జర్లాండ్‌( Switzerland ) తన ఉనికిని చాటుకుంది.

 The Best Country In The World Is Our Country At What Level, U.s. News Unveils 2-TeluguStop.com

ఇక భారతదేశం అయితే గత ఏడాదితో పోలిస్తే, ఇప్పుడు మూడు స్థానాలకు కిందకి దిగి 33వ స్థానాన్ని సరిపెట్టుకుంది.

Telugu India Drops, Ranks, Switzerland, Level, Spots, Unveils-Latest News - Telu

స్విట్జర్లాండ్ పర్యాటకులకు స్వర్గధామం వంటిది.సాహసం, వ్యాపార అవకాశాలు, సంస్కృతి, సంప్రదాయాలు, సాంస్కృతిక ప్రయోజనం వంటి వివిధ అంశాల ఆధారంగా నిర్వహించిన సర్వే ద్వారా స్విట్జర్లాండ్‌ ఈ ఘనత దక్కించుకుంది.ఈ సర్వే ఆధారంగా 89 దేశాలకు ర్యాంక్ లభించింది.

మెజార్టీ విభాగాల్లో ఉన్నతంగా ఉన్న స్విట్జర్లాండ్‌.ఈ జాబితాలో తొలి స్థానం దక్కించుకోవడం విశేషం.

ఈ సర్వేలో సెంట్రల్ యూరోపియన్ ( Central European )దేశమైన స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలవడం ఇది ఏడవసారి కావడం విశేషం.ఈ క్రమంలో ఐరోపా దేశాలు టాప్ 25లో మెజారిటీగా స్థానాలను దక్కించుకున్నాయి.

స్విట్జర్లాండ్ తర్వాత రెండోస్థానంలో జపాన్‌, ఆ తర్వాత.వరుసగా.

అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా చోటు దక్కించుకున్నాయి.

Telugu India Drops, Ranks, Switzerland, Level, Spots, Unveils-Latest News - Telu

ఈ సంవత్సరం జాబితాలో భారతదేశం 33వ స్థానంతో సరిపెట్టుకుంది.ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ ( United Arab Emirates, Qatar )మాత్రమే రెండు మధ్య-ప్రాచ్య దేశాలు వరుసగా 17, 25 స్థానాల్లో నిలిచాయి.అయితే స్విట్జర్లాండ్‌లా కాకుండా భారతదేశం అత్యున్నత ర్యాంకింగ్ ‘మూవర్స్’ (సంఖ్య 7), వారసత్వం (హెరిటేజ్ సంఖ్య 10) రంగంలో ముందు ఉండడం గమనించదగ్గ విషయం.

అయితే సామాజిక ప్రయోజనం, సాహస విభాగాల్లో భారతదేశ ర్యాంకింగ్ దారుణంగా పడిపోయింది.US న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ద్వారా ది బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ అనేది గత తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న ప్రాజెక్ట్.

ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే… దేశం అంటే కేవలం సంపద ఉన్నవి మాత్రమే కావని.అంతకు మించి దేశాలకు విలువలు ఉండాలని పరిశీలించడానికి ఈ సర్వే పాటుపడుతుంది.36 దేశాల నుండి మొత్తం 16,960 మంది వ్యక్తులు ఈ సర్వే నిర్వహిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube