వైరల్: పెగ్గేసిన అంకుల్.. అద్దం ముందు ఏం చేస్తున్నాడో చూడండి!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.సాధారణంగా మందుబాబుల విన్యాసాలు గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 See What Viral Peggesina Uncle Is Doing In Front Of The Mirror, Drunken, Old Man-TeluguStop.com

ఫుల్లుగా తాగేసిన ప్రబుద్ధులు చాలామంది రోడ్లపై యోగాలు చేస్తూ ఉంటారు.అటువంటి వీడియోలు మనం అనేకం చూస్తూ ఉంటాము.

ఈ క్రమంలోనే ఓ వృద్ధుడు తన స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లి, మందు తాగుతూ ఎంజాయ్ చేసాడు.దీంతో మత్తు అతడి నషాళానికి ఎక్కింది.

ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు చిక్కు వచ్చింది.పార్టీలోంచి బయటికి వెళ్లే క్రమంలో అతను ఓ అద్దం ముందు ఆగాడు.

అద్దంలో తనని తాను చూసుకుని వేరే వ్యక్తి అనుకున్నాడేమో పాపం.ఇక్కడే పెద్ద జోక్ జరిగింది.

అతను ఏ పక్కకు తప్పుకున్నా అద్దంలో ప్రతిబింబం కూడా అటువైపే తిరుగుతుండడంతో వృద్ధుడు ఒకింత తికమక పడ్డాడు.బాగా మత్తులో ఉన్నాడేమో ఏమో గానీ, ఎదురుగా నిల్చున్న వ్యక్తి తనను ఆటపట్టిస్తున్నాడేమో అనుకుని తన ప్రతిబింబంపై( reflection ) తానే సీరియస్ అవుతాడు.ఈ నేపథ్యంలో తనతోనే తాను మాట్లాడుతూ… ‘‘నువ్వు పక్కకు తప్పుకొంటే.నేను వెళ్లిపోవాలి’’.అంటూ తన ప్రతిబింబంపై ఆగ్రహం వ్యక్తం చేసాడు.ఇలా అతను చాలా సేపు అద్దం ముందు నిలబడి విచిత్రంగా ప్రవర్తిస్తూనే ఉంటాడు.

ఈ ఘటనను చూసి అక్కడున్న వారు పగలబడి నవ్వుకుంటూ, ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇంకేముంది, కట్ చేస్తే… ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.దాంతో నెటిజన్లు వివిధ రకాలుగా ఆ వీడియోపై స్పందిస్తున్నారు.‘‘మందు కొడితే మామూలుగా ఉండదు!’’.

అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, ‘‘ఈ అంకుల్ బంకులా తాగినట్టున్నాడు… పీపా మొత్తం నిండిపోయి ఉంటుంది… పీక మొయ్య తాగితే ఇలాగే ఉంటుంది!’’.అంటూ మరికొందరు కామెంట్స్ చేసారు.

మరికొంత మంది వివిధ రకాల ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.కాగా ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకొని పదివేలకు చేరువగా వెళుతోంది.

లైక్స్ అయితే లెక్కేలేదు… చూసిన ప్రతి ఒక్కరు దాదాపుగా లైక్ చేస్తున్నారు సదరు వీడియోని.మీరు కూడా ఓ లుక్కేసి జరా కామెంట్ పెట్టండి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube