వైరల్: కోడిని వెంటాడిన మొసళ్లు.. ఎవరు గెలిచారంటే?

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.అందులో జంతువులకు( animals ) సంబంధించినవే ఎక్కువగా ఉండడం మీరు గమనించే ఉంటారు.

 Who Won The Crocodiles That Chased The Viral Chicken, Crocodile, Chasing, Chic-TeluguStop.com

మరీ ముఖ్యంగా మొసళ్లకు సంబంధించిన అనేక వీడియోలను నెటిజన్లు చాలా ఆసక్తిగా తిలకిస్తూ ఉన్నారు.ఎందుకంటే కొన్నిసార్లు మొసళ్లు ఏంతో ఓపిగ్గా పెద్ద పెద్ద జంతువులను సైతం అవలీలగా నోటితో పట్టేసుకుంటాయ్.

ఇలాంటి వీడియోలు చూసినపుడు కనుల విందుగా ఉంటుంది కాబట్టి ఆయా విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో విషయం ఏమిటంటే, మొసళ్లు ( Crocodiles )గుంపు కలిసి ఓ కోడిని టార్గెట్ చేయడం.మొసళ్లు కోడిని టార్గెట్ చేయడం ఏమిటి? అని అవాక్కవుతున్నారా? మరెందుకాలస్యం… విషయం చదివేయండి.వీడియోని ఒకసారి పరిశీలిస్తే, చెరువులోని మొసళ్లన్నీ ఆహారం కోసం ఒడ్డుకు వేచి చూస్తుంటాయి.వాటికి ఇటువంటి ఆహారం అక్కడ కనిపించదు.దాంతో అలాగే ఏమైనా అక్కడికి రాకపోతుందా అని వేచి చూస్తూ ఉంటాయి.ఇంతలో షాకింగ్ ఘటన.ఓ కోడి అటుగా రావడంతో దాన్ని చూసిన మొసళ్లకు ప్రాణం లేచొస్తుంది.ఎలాగైనా కోడిని అమాంతం మింగేయాలని అన్నీ కలిసిట్టుగా ప్లాన్ వేసాయి.

ముందుగా ఓ మొసలి కోడిని వెంబడిస్తుంది.అయితే కోడి మాత్రం దానికి దొరక్కుండా ముందు ముందుకు పరుగెడుతుంది.

ఆ తర్వాత ఒకదాని తరువాత ఒకటి కోడిని పట్టుకునే ప్రయత్నం చేస్తాయి.అయితే మొసళ్లన్నీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కోడి మాత్రం వాటికి చిక్కకుండా అటూ, ఇటూ ఎగురుతూ వాటికి పట్టపగలే చుక్కలు చూపిస్తుంది.ఇలా చాలా సేపు వాటి మధ్య పోటీ నెలకొంటుంది.అయినప్పటికీ ఆ మొసళ్లు కోడిని పట్టుకోలేక పోతాయి.ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా సదరు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.దాంతో దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

‘‘మొసళ్లకు చుక్కలు చూపించిన కోడి’’.అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే… ‘‘కోడిని పట్టుకోవడం అంత తేలిక కాదు సుమా!’’.

అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube