సమాజం అంగీకరించని, ఎవరికీ ఇష్టం లేని పనులు కంటెస్టెంట్ల చేత చేయించడం బిగ్‌బాస్‌కి అలవాటే.చాలా సీజన్లుగా బిగ్‌బాస్( Bigg Boss ) యాజమాన్యంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.
అయినా సరే బిగ్‌బాస్ తన ధోరణిని మార్చుకోడు.ఎవరిని ఎలా చూపించాలో అలాగే చూపిస్తాడు.
మంచి వారిని కూడా నెగిటివ్‌గా చూపించి ఎంటర్‌టైన్‌మెంట్ పంచడమే అతడి ధ్యేయం.కంటెస్టెంట్లు మాట్లాడేది వేరు, బిగ్‌బాస్ ప్రోమో కట్ చేసి జనంలోకి వదిలేది వేరు.
ఎవరినైనా పాజిటివ్‌గా చూపించాలని భావిస్తే అతడు చేసిన తప్పులన్నీ కట్ చేస్తాడు.మిగతా పాజిటివ్ యాక్షన్స్ మాత్రమే చూపిస్తాడు.

కంటెస్టెంట్ల గేమ్ ప్లాన్ ప్రకారం వాళ్లు నెగటివ్ పనులు చేస్తున్నారేమో అని ప్రేక్షకులు భ్రమ పడుతుంటారు.కానీ అది నిజం కాదు.అసలు గేమ్ ప్లాన్ అమలుపరిచేదే బిగ్‌బాస్.బీబీ టీమ్ ఏది చెబితే అదే శాసనమని చెప్పుకోవచ్చు.బీబీ యాజమాన్యం రాసిచ్చిందే నాగార్జున గుడ్డిగా చెప్పేస్తుంటాడు.మొత్తం మీద బకరాలు అయ్యేది బిగ్‌బాస్ ప్రేక్షకులే! ఈసారి సీజన్‌లో సీత, విష్ణుప్రియ( Vishnupriya ) పార్టిసిపేట్ చేశారు.
వీరు చాలా బోల్డ్.వారిని కాపాడేందుకు వారి నెగటివిటీని మొత్తం కట్ చేసి ప్రేక్షకులకు చూపిస్తున్నాడు బిగ్ బాస్.
వారి నెగెటివిటీ ప్రజల్లోకి పోకుండా కాపాడేందుకు ఆకుల సోనియాను బలి చేస్తున్నాడు.బిగ్ బాస్ విష్ణుప్రియతో సోనియా( Sonia )ను ఓ అడల్ట్ ప్రశ్న అడిగించాడు.
ఆ క్వశ్చన్ ఫేస్ చేసిన ఎవరైనా సరే ఎలా రియాక్ట్ అవుతారో అలాగే సోనియా రియాక్ట్ అయింది.ఆమె దాన్ని వ్యతిరేకించింది.
ఇక అప్పటినుంచి ఆమెను నెగిటివ్‌గా చూపించడం ప్రారంభించాడు బిగ్ బాస్.విష్ణుప్రియ, సీతలకు వ్యతిరేకత పెరిగిపోతుందేమో అని నిఖిల్, సోనియా మధ్య నిజంగానే ఏదో యవ్వారం నడుస్తుందనేట్టుగా ఒక ఫేక్ డ్రామాకు కూడా తెరలేపాడు.“నువ్వు సిగరెట్ మానేయ్ నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తా” అని సోనియా నిఖిల్‌తో నిస్సిగ్గుగా చెబుతున్నట్టు ఒక ప్రోమో కట్ చేసి దాన్ని రీసెంట్‌గా రిలీజ్ చేశారు.అలా సోనియాది ఇంత చీప్ కేరక్టర్‌హా అని ప్రేక్షకులు ఆమెను అసహ్యించుకునేలాగా బిగ్‌బాస్ ప్లాన్ చేశాడు.

ఆ వ్యవహారం గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.నిఖిల్ “నన్ను బిడ్డగా దత్తత తీసుకో” అని సోనియా( Sonia )ను బతిమిలాడతాడు.అప్పుడు “నువ్వు సిగరెట్ మానెయ్, నువ్వేది అడిగితే అది చేస్తా” అని సోనియా చెప్తుంది.ఇలా మాట్లాడడంలో తప్పేం లేదు.కానీ సోనియా దిగజారిందని బిగ్‌బాస్ చూపించాడు.అలా నీచంగా పోట్రే చేయడం బిగ్‌బాస్‌కు తగని వ్యవహారం.
నిఖిల్ ఆల్రెడీ బయట సీరియల్ టీవీ నటి కావ్యతో లవ్ అఫైర్ నడిపిస్తున్నాడు.సోనియా నిఖిల్ కంటే వయస్సులో పెద్ద.
ఆమె బయట వేరే కుటుంబం ఉంది.బిగ్‌బాస్ అవేమీ పట్టించుకోకుండా ఆమెకు అనవసరమైన అఫైర్లు అంటగడుతున్నాడు ఇది చాలా తప్పు.
ఇక పనికిరాని పవర్స్ ఎవరికి పడితే వారికి ఇచ్చేసి ఎవరినైనా సేవ్ చేయవచ్చు అని దిక్కుమాలిన షో నడుపుతున్నాడు.తెలుగు కంటెస్టెంట్లు తెలుగులో తప్ప మిగతా అన్ని భాషలో మాట్లాడుతున్నారు దీనివల్ల చిరాకు పుడుతోంది.
ఒక్క శేఖర్ బాషా స్పాంటేనియస్ జోక్స్ తప్ప మిగతా అంతా పెంట పెంట చేశారని చెప్పుకోవచ్చు.