బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదవ సీజన్ ఈసారి పెద్దగా తెలియని మొహాలతో ప్రారంభమైంది.అసలు వారు నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా కూడా కనిపించడం లేదు వారికి మానసిక సమస్యలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
అలాంటి వారితో సీజన్ 8 స్టార్ట్ చేసి పిచ్చెక్కిస్తోంది బిగ్ బాస్.పాపులర్ సెలెబ్రెటీలకు రోజూ రూ.లక్షల శాలరీ ఇవ్వడం వారిని మేపడం కష్టం అని బిగ్ బాస్ యాజమాన్యం భావించినట్లు ఉంది అందుకే ఈసారి చెత్త కంటెస్టెంట్లను తీసుకువచ్చింది. సోషల్ మీడియా( Social media )లో పాపులర్ అయిన వారిని తక్కువ రెమ్యునరేషన్లకి ఒప్పించి తీసుకువస్తే చాలా భారం తగ్గుతుందని భావించినట్లు ఉంది.
అలాగే వారి మధ్య గొడవలు పెడితే టీఆర్పీ రేటింగ్స్ ఎక్కువగా వస్తాయని ఫస్ట్ ఎపిసోడ్ నుంచే గొడవలు స్టార్ట్ చేసింది.వివిధ రకాల ప్రయత్నాలు వల్ల ఫస్ట్ వీక్ బాగానే టీఆర్పి రేటింగ్స్ వచ్చాయి.
ఆడియన్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందుకున్నారు.హౌస్ లో అందరి కంటే శేఖర్ బాషా బాగా హైలైట్ అవుతున్నాడు.
ఆడియోస్ కూడా ఇతడికి కనెక్ట్ అవుతున్నారు.బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు శేఖర్ బాషా రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారంలో వేలు పెట్టాడు.
రాజ్ తరుణ్‌కు మద్దతుగా అతడు కామెంట్స్ చేశాడు.ఆ సమయంలో శేఖర్ లో చాలా ఫైర్ కనిపించింది బిగ్ బాస్ హౌస్ లో మాత్రం అతడిలో ఫైర్ అనేది పూర్తిగా మిస్ అయింది.
శేఖర్ భాష హౌస్ లో హిలేరియస్ కామెడీ చేస్తున్నాడు.అతని కామెడీ టైమింగ్‌కు, పేల్చే జోకులకు ఆడియన్స్ తెగ నవ్వుకుంటున్నారు.

నాగార్జున( Nagarjuna ) కూడా ఈయన జోకులకు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వేశాడు.బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి నిన్నటి ఎపిసోడ్ వరకు ఈయన వందల సంఖ్యలో ఫన్నీ పంచులు వదిలాడు.సినిమాల్లో ఏ కామెడీ డైరెక్టర్ కూడా వదిలి ఉండదు.రీసెంట్ ఎపిసోడ్లో కూడా అతడు మరొక ఆణిముత్యం వదిలాడు.దాన్ని విని చాలామంది తెగ నవ్వేసుకుంటున్నారు.ఈ ఎపిసోడ్లో వాష్‌రూమ్‌లో అభయ్ నవీన్, శేఖర్ బాషా మధ్య ఒక కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది.
అభయ్ వీన్ ఫేస్ వాష్ చేసుకుంటున్న సమయంలో శేఖర్ బాషా మాట్లాడుతూ ‘అత్యధిక శాతం మంది జనాలు సెప్టెంబర్ నెలలోనే పుడుతారట, తెలుసా?’ అని ఒక క్వశ్చన్ వేస్తాడు.

తెలియదు అంటాడు అభయ్( Abhay ).అప్పుడు శేఖర్ బాషా సమాధానం చెబుతూ ‘తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చేది 9వ నెలలోనే కదా.9వ నెల అంటే సెప్టెంబర్ నెలేగా” అని ఒక జోక్ పేల్చాడు.ఇంకా ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలు వదులుతూనే అందర్నీ నవ్విస్తున్నాడు.ఆదిత్య ఓం, శేఖర్ బాషా ఫస్ట్ డే నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ గా మెలుగుతున్నారు.అందుకే శేఖర్ అతనికి 200 జోక్స్ చెప్పి బాగా నవ్వించాడు.అయితే ఈ జోక్స్ పై మాత్రమే ఆధారపడితే అతడు హౌస్ లో ఎక్కువ కాలం సర్వైవ్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి అతను ఆటపై కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది.