రాజేంద్రప్రసాద్‌కి చాలా తిక్క ఉంది.. బ్రతిమలాడి చేయించుకోవాలి

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్( Rajendra Prasad ) కామెడీ, రొమాన్స్ ఎమోషనల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎలాంటి సన్నివేశాల్లోనైనా అద్భుతంగా నటించగలడు.ఆయన పాత్ర వేస్తే ఆ పాత్రకే అందం వస్తుందంటే అతిశయోక్తి కాదు.

 Sv Krishna Reddy About Actor Rajendra Prasad ,rajendra Prasad , Aa Naluguru ,-TeluguStop.com

కామెడీ చేసి కూడా హీరో అవ్వచ్చు అని రాజేంద్రప్రసాద్ నిరూపించాడు.ఆ ఒక్కటి అడక్కు, అహ నా పెళ్ళంట!, ఏప్రిల్ ఒకటి విడుదల, లేడీస్ టైలర్ వంటి సినిమాలతో ఇతను మనల్ని ఎంతగానో నవ్వించాడు.కాష్మోరా లాంటి సినిమాలతో భయపెట్టాడు.“ఆ నలుగురు( Aa Naluguru )” లాంటి మూవీలతో ఏడిపించాడు.ఈ అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే అతను హీరోగా చేసిన “మాయలోడు” సినిమా మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు.ఇందులో సహజనటి సౌందర్య రాజేంద్రప్రసాద్ సరసన నటించింది.

Telugu Aa Naluguru, Mayalodu, Organicmama, Rajendra Prasad, Sarada Saradaga, Sou

ఈ మూవీ గురించిన విశేషాలు ఎన్ని చెప్పినా ఇంకా మిగిలిపోతాయి.దీనికి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ, మ్యూజిక్ అన్నీ ఎస్వీ కృష్ణారెడ్డే( SV Krishna Reddy ) అందించాడు.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.దీని తర్వాత వీరి కాంబినేషన్‌లో మరిన్ని సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుకున్నారు.కానీ రాజేంద్రప్రసాద్ ఎస్వీ కృష్ణారెడ్డిని బాగా ఇబ్బంది పెట్టాడని, అందుకే అతనితో కలిసి కృష్ణారెడ్డి ఏ సినిమా తీయకూడదని డిసైడ్ అయ్యాడని రూమర్స్ వచ్చాయి.ఆ రూమర్స్ బలపరిచే లాగానే వీరిద్దరూ కాంబినేషన్‌లో మళ్ళీ ఏ మూవీ రాలేదు.

మాయలోడు లాంటి మంచి సినిమా వచ్చిన తర్వాత వీరి కాంబోలో ఎందుకు సినిమా రాలేదు? వీరి మధ్య నిజంగానే గొడవ జరిగిందేమో అని చాలామంది అనుకున్నారు.అయితే ఒక తాజా ఇంటర్వ్యూలో ఎస్.

వి కృష్ణారెడ్డిని ఇదే ప్రశ్న సూటిగా అడిగారు.మీ మధ్య ఏమైంది? ఎందుకు కలిసి సినిమాలు తీయలేదు అని ప్రశ్నించారు.

Telugu Aa Naluguru, Mayalodu, Organicmama, Rajendra Prasad, Sarada Saradaga, Sou

దానికి అలనాటి దిగ్గజ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సమాధానం చెబుతూ “రాజేంద్రప్రసాద్ మంచివాడే.కానీ మా మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తుంటాయి.మంచివాడు కాబట్టే నేను ఇటీవల తీసిన “ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు (2023)( Organic Mama Hybrid Alludu ) సినిమాలో యాక్ట్ చేశాడు.“మాయలోడు (1993)” మూవీ చేస్తున్న సమయంలో మా మధ్య కాస్త మనస్పర్ధలు వచ్చాయి.తర్వాత కొన్నేళ్ల వరకు ఆయనతో కలిసి నేను సినిమా చేయలేదు.2006లో “సరదా సరదాగా” సినిమాలో మాత్రం కలిసి పనిచేశాం.ఆయన మంచోడే కానీ కొంచెం తిక్క, ఈగో ఉంటుంది.ఆయనతో సినిమా అంటే బాగా బతిమిలాడించుకుంటాడు.చాలా సీన్లు బ్రతిమాలి మరీ ఆయన చేత చేయించుకోవాల్సి వస్తుంది.” అని పేర్కొన్నాడు.కృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈగోకి పోకుండా ఉన్నట్లయితే రాజేంద్రప్రసాద్ ఖాతాలో మరిన్ని మంచి హిట్స్ పడి ఉండేవేమో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube