ధోనీని హైలెట్ చేయడం తెలుగువాళ్లకు నచ్చలేదు.. వెంకట్ ప్రభు షాకింగ్ కామెంట్స్!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి( Vijay Thalapathy ) హీరోగా నటించిన తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్.( The Greatest Of All Time ) వెంకట్ ప్రభు( Venkat Prabhu ) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 5వ తేదీన విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

 Venkat Prabhu Says Goat Did Not Work Well Hindi And Telugu Because Details, Venk-TeluguStop.com

అయితే కోలీవుడ్లో ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ టాలీవుడ్ అలాగే బాలీవుడ్ లో మాత్రం మిశ్రమ స్పందన లభించింది.దానికి తోడు సినిమాకు కూడా రెండు చోట్ల కాస్త నెగటివ్ టాక్ రావడంతో రెండు చోట్ల కలెక్షన్స్ కూడా తగ్గిపోయాయి.

మరోవైపు వినాయక చవితి పండుగ సెలబ్రేషన్స్ సందర్భంగా కూడా కలెక్షన్ తగ్గినట్టు తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా కలెక్షన్లు తగ్గడంపై డైరెక్టర్ వెంకట్ ప్రభు స్పందించారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.ఈ చిత్రంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని( MS Dhoni ) హైలైట్‌ చేయడం తెలుగు, హిందీ ప్రేక్షకులకు నచ్చలేదు.

అందుకే అక్కడ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.ధోనీని హైలైట్‌ చేయడం వల్ల ఫలితం రాలేదనడం కరెక్ట్‌ కాదని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.కాగా ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది.

కానీ ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న స్పందనను బట్టి చూస్తుంటే ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితం అవడం కాస్త కష్టమే అని అనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube