సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు వారి ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు.వారు తీసుకునే ఆహార విషయంలో కానీ, చేసే పనులలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు.
వారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుని ఖచ్చితంగా ఆ డైట్ ను ఫాలో అవుతుంటారు.గర్భధారణ సమయంలో కొందరిలో వాంతులు, వికారం వంటి సమస్యలు అధికంగా బాధిస్తుంటాయి.
వారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నా వారి శరీరానికి పడవు.అలాంటప్పుడు శిశువు పెరుగుదల లోపం ఏర్పడుతుంది.
మరికొందరిలో గర్భం ధరించినప్పుడు వారు మధుమేహానికి గురవుతుంటారు.దీనినే జెస్టేషనల్ డయాబెటిస్ అని అంటారు.
గర్భిణీ స్త్రీలలో హార్మోన్ల అసమ తుల్యత వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు హెచ్చు తగ్గులు అవుతుండటం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి.అయితే ఈ డయాబెటిస్ ను నియంత్రించడానికి సమతుల ఆహారం తీసుకోవటం ద్వారా నియంత్రించవచ్చు.
పిండి పదార్థాలు తక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకొని ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ గల ఆహార పదార్థాలను తీసుకోవాలి.అన్నం తక్కువగా తిని, కూరలు అధిక మోతాదులో తీసుకోవాలి.
ఆహారం తీసుకునేటప్పుడు ఎక్కువ మొత్తంలో ఒకేసారి తినకుండా కొద్ది మోతాదులో ఎక్కువ సార్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా లభించే పదార్థాలను తీసుకోవాలి.
డయాబెటిస్ తో బాధపడేవారు వారి ఆహారంలో కొద్దిరోజుల పాటు చక్కెర, స్వీట్లు మొదలైన తీపి పదార్థాలను మానేయడం ఎంతో మంచిది.
ఈ సమస్యతో బాధపడే వారు ఎప్పుడూ రక్తంలోని చక్కెర స్థాయిలను గమనించుకుంటూ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి.
అంతేకాకుండా గర్భిణీ స్త్రీలలో అధిక రక్తపోటు కూడా పెద్ద సమస్యగా మారుతుంది.వీలైనంతవరకూ తరుచు రక్తపోటును, రక్తంలోని చక్కెర స్థాయిలను గమనించుకుంటూ ఉండాలి.
రాత్రి పడుకునే ముందు మజ్జిగ తాగడం ద్వారా అజీర్తి సమస్యలు తొలగిపోతాయి.అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం ఒక అరగంట పాటు నడవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం.