తెలుగు రాష్ట్రాలకు సహాయం చేసిన తమిళ హీరో శింబు.. మార్పు మొదలైందిగా!

గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.మరి ముఖ్యంగా విజయవాడ ప్రజలు భారీ వరదల( Floods ) కారణంగా ఇల్లు విడిచి వెళ్లిపోవడంతో పాటు కొంతమంది వరదల్లో కొట్టుకుపోయారు.

 Kollywood First Hero Simbu Donated For Telugu States Flood Vitims Details, Kolly-TeluguStop.com

తినడానికి తిండి లేక అంతస్తుల ఎత్తులో నీరు పారుతుండడంతో బిక్కుబిక్కుమంటూ అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు.ఇకపోతే ఇప్పటికే విజయవాడ పరిస్థితిని చూసి చాలా మంది చలించిపోయి సామాన్యులు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

Telugu Aptelangana, Flood Vitims, Kollywood, Simbu, Simbu Donate, Simbu Flood, T

ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కోట్లకు కోట్లు విరాళాలను ప్రకటించారు.అలాగే హీరోయిన్స్ నుంచి అయితే తెలుగు యంగ్ నటి అనన్య నాగళ్ళ 5 లక్షలు ప్రకటించింది.కానీ ఇప్పటివరకు తమిళ హీరోలు( Tamil Heroes ) ఎవరు ఈ విషయంపై స్పందించకపోవడంతో చాలామంది పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ మండిపడిన విషయం తెలిసిందే.ఎవరూ కూడా విరాళాలను అందించకపోవడంతో చాలామంది మండిపడ్డారు.

అయితే ఇప్పుడు మొట్ట మొదటి సారిగా ఒక తమిళ్ హీరో స్పందించి తన ఉదారతను చాటుకున్నాడు.అతను మరెవరో కాదు నటుడు శింబు.

( Simbu ) ఒకప్పుడు తెలుగులో కూడా సాలిడ్ హిట్స్ ని కొట్టాడు.

Telugu Aptelangana, Flood Vitims, Kollywood, Simbu, Simbu Donate, Simbu Flood, T

మరి ఇప్పుడు తమిళ్ లో పలు చిత్రాలు చేస్తుండగా తన నుంచి మరీ అంత ఎక్కువ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి రావడం లేదు అయినా కూడా ఇతర స్టార్స్ ని మించి తన గొప్ప మనసుని చాటుకున్నాడని చెప్పాలి.మరి రెండు తెలుగు రాష్ట్రాలకి గాను శింబు 6 లక్షల విరాళాన్ని సహాయనిధి అందిస్తున్నట్టుగా తెలిపాడు.దీనితో తమిళ్ నుంచి తెలుగులో ఎన్నో సినిమాలు రిలీజ్ చేసుకుంటూ లాభాలు పొందిన హీరోలు చేయనిది మొట్టమొదటిగా శింబు చేసాడని తెలుగు ఆడియెన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube