ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ప్రేక్షకులను మెప్పించలనే ఉద్దేశ్యం తోనే దర్శకులు సినిమాలను చేస్తూ ఉంటారు.ఇక ఆ సినిమాలు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంది.
దానికోసమే కొంతమంది దర్శకులు కమర్షియల్ సినిమాలను చేస్తుంటే మరి కొంత మంది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు.
ఇక తెలుగు సినిమా డైరెక్టర్లు చాలామంది ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ మంచి గుర్తింపు అయితే ఉంది.మరి అలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో సక్సెస్ సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్, హరీష్ శంకర్ ( Puri Jagannath, Harish Shankar )లాంటి దర్శకులు మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగారు.
కానీ ఇప్పుడు వాళ్ల హవా తగ్గిపోయింది.ఇక వాళ్ల వారసులుగా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను( Commercial movies ) చేసేవారు ఎవరున్నారు అనే విషయం లో చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి.
ఇక వీళ్ళ వారసులుగా సుజీత్, బుచ్చిబాబు( Sujeet, Buchibabu ) లాంటి దర్శకులు మారబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే రాబోయే కొన్ని సంవత్సరాల్లో వీళ్లు స్టార్ డైరెక్టర్లుగా మారడమే కాకుండా ఇండస్ట్రీ ని శాసించే దర్శకులుగా కూడా మారబోతున్నట్లుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే వాళ్ళు చేయబోయే సినిమాలే వాళ్ళని స్టార్ డైరెక్టర్ గా మార్చబోతున్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాలతో వాళ్లను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా మార్చుకోవడమే కాకుండా స్టార్ హీరోలందరితో సినిమాలను చేయడానికి కూడా వాళ్ళు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి వీళ్ళు అనుకున్నట్టుగానే వీళ్ళు చేసే సినిమాలు సక్సెస్ అవుతాయా లేదా అనేది…
.