అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మారుమోగుతోన్న మన ‘‘ నాటు నాటు ’’

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.( RRR ) భారత స్వాతంత్య్రోద్యమం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది.అంతేకాదు.ఇందులోని నాటు నాటు పాటకు( Naatu Naatu Song ) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్( Oscar Award ) వరించింది.

 Us Presidential Election Kamala Harris Team Make Campaign Song With Nacho Nacho-TeluguStop.com

ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫిలో వచ్చిన ఈ పాటకు ఆడియన్స్ ఫిదా అయ్యారు.అన్ని భాషలకు చెందినవారు నాటు నాటు సాంగ్‌కి డ్యాన్స్‌లు వేస్తూ దానిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేవారు.

తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ నాటు నాటు సాంగ్‌‌‌‌ మారుమోగుతోంది.నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో గెలుపొందేందుకు గాను డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్,( Kamala Harris ) రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) వ్యూహాలు రచిస్తున్నారు.ముఖ్యంగా భారత సంతతి ఓటర్లను ఆకట్టుకోవడానికి రెండు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.దీనిలో భాగంగానే డెమొక్రాటిక్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన అజయ్ భూటోరియా నాటు నాటు హిందీ వెర్షన్ ‘నాచో నాచో’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో హారిస్ – వాల్జ్ ప్రచార చిత్రాలను రూపొందించారు.

నాచో నాచో పాట ద్వారా దక్షిణాసియా కమ్యూనిటీతో అనుసంధానం కావడమే తమ లక్ష్యమని అజయ్ జైన్ పేర్కొన్నారు.4.4 మిలియన్ల మంది భారతీయ ఓటర్లు, 6 మిలియన్ల మంది దక్షిణాసియా ఓటర్లు నవంబర్ 5న తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఆయన చెప్పారు.2020 ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకున్నట్లే .ఈ ఎన్నికల్లో కమలా హారిస్‌ను అధ్యక్షురాలిగా ఎన్నుకునే సమయం వచ్చిందని అజయ్ అన్నారు.నవంబర్ 5 ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే.

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube