ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో దివంగత నటి శ్రీదేవి( Sridevi ) ఒకరు.శ్రీదేవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే బాల నటిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపారు.
ఇలా అన్ని భాషలలోనూ ఎంతో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన శ్రీదేవి ఆకాల మరణం ఇప్పటికీ ఇండియన్ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.ఇక శ్రీదేవి మరణం తర్వాత ఈమె కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టారు.
ఇప్పటివరకు కేవలం బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్న ఈమె మొదటిసారి దేవర సినిమా ( Devara Movie ) ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా మొదటి సినిమాతోనే నటిగా తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన జాన్వీ ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.ఇకపోతే జాన్వీ కపూర్ చిన్నప్పటినుంచి తన తల్లి సలహాలు తీసుకుంటూ ఆమె చెప్పిన మార్గంలోనే నడిచేవారు.ఒక్కసారిగా ఆమె మరణం తర్వాత తన పరిస్థితి అయోమయంగా మారిపోయిందని ఆ సమయంలోనే తన పెద్దమ్మ రేఖ ( Rekha ) తనకు అండగా నిలిచారు అంటూ ఒక సందర్భంలో వెల్లడించారు.
నిజానికి శ్రీదేవి సినీనటి రేఖ ఇద్దరు సొంత అక్క చెల్లెలు కాకపోయినా వీరిద్దరూ అంత సఖ్యతగా ఉండేవారని తెలిపారు.
నటన పరంగా వీరిద్దరి ఆలోచనలు ఎప్పుడు ఒకేలా ఉంటాయి.అందుకే అమ్మ లేకపోయినా నాకు అమ్మ తర్వాత అమ్మలా కెరియర్ పరంగా వ్యక్తిగత జీవితంలో కూడా నాకు సలహాలు ఇస్తారని జాన్వీ కపూర్ తెలిపారు.అమ్మ తర్వాత నేను ఎవరి సలహా కోసమైనా ఎదురుచూస్తాను అంటే అది పెద్దమ్మ రేఖ సలహా కోసమే ఎదురు చూస్తానని తెలిపారు.
అమ్మ చనిపోయిన తర్వాత ధడక్ సినిమా విడుదల అయింది ఆ సినిమా ట్రైలర్ లాంచ్ నుంచి మొదలుకొని విడుదల వరకు పెద్దమ్మ నాకు ఎన్నో సలహాలు ఇచ్చారని, అమ్మ తర్వాత నాకు అన్ని తానే అంటూ జాన్వీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.