సూర్యాపేట జిల్లా:గత బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వంలో పదేళ్లపాటు నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించారని,ఈ ఏడాది మున్సిపల్ కమిషనర్ కమిషన్ల కక్కుర్తితో సరైన ఏర్పాట్లు చేయక మహిళలు ఇబ్బందులు పడ్డారని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు.శుక్రవారం సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మున్సిపల్ కమిషనర్ పనిచేయాల్సి ఉన్నప్పటికీ అలా చేయడం లేదని, అధికార పార్టీ నాయకులు చెప్పే పనులు,కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు.
మున్సిపల్ చైర్మన్ కు తెలవకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఇన్చార్జి పాలనకు తలోగ్గి పనిచేస్తున్నారన్నారు.సూర్యాపేట జిల్లా ( Suryapet District )కేంద్రంలో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లు మహిళల ఆనందాన్ని హరించి వేశాయన్నారు.
మున్సిపల్ కమిషనర్ ఏర్పాట్లు ఏమి చేస్తున్నారని అడుగుదామంటే ఫోను ఎత్తి సమాధానం చెప్పే పరిస్థితి లేదన్నారు.ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలకవర్గం చెబితే చేయని పనిని,ఇన్చార్జిలు చెబితే వెంటనే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రోటోకాల్ పాటించకుండా ఏదైనా అడిగితే పైనుంచి ఆర్డర్ అని చెబుతున్నాడని,పై ఆదేశాలకు ఎందుకు భయపడుతున్నారో కమిషనర్ సమాధానం చెప్పాలన్నారు.బతుకమ్మ ఏర్పాట్ల విషయానికి వస్తే స్టేజీ కూడా సరిగా లేదని, పదేండ్లు మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్ రెడ్డి వస్తే కమిషనర్ స్టేజి వద్ద లేకుండా పోయారన్నారు.
మేము కమిషనర్‌ను ఏనాడు భయపెట్టలేదని,ఎవరు భయపెడుతున్నారో చెప్పాలన్నారు.
బతుకమ్మలు తీసుకొచ్చిన మహిళలు నిమజ్జన ప్రదేశంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదని సాక్షాత్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కలుగచేసుకొని మహిళల నుంచి బతుకమ్మలు తీసుకొని చెరువులో నిమజ్జనం చేశారన్నారు.
బతుకమ్మ ఏర్పాట్లలో కమిషనర్ పూర్తిగా విఫలమయ్యాడని కొందరి చేతుల్లో కీలుబొమ్మగా మారాడని పాలకమండలికి కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు.సూర్యాపేటలో మంచినీటి సరఫరా విషయానికి వస్తే మిషన్ భగీరథ నుంచి 24 ఎమ్మెల్టి నీరు వస్తే పట్టణంలో 17 ఎమ్మెల్టి నీరు మాత్రమే సరఫరా అవుతుందని మిగతా ఎనిమిది ఎమ్మెల్టి నీరు ఎటు వెళ్తుందో సమాధానం చెప్పాలన్నారు.
ముఖ్యమైన సెక్షన్లలో ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ తో పనిచేస్తూ వారిని బాధ్యులను చేస్తూ కమిషన్లకు తెరలేపాడు అన్నారు.ఇప్పటికైనా కమిషనర్ తన పద్ధతి మార్చుకొని ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలకవర్గాన్ని గౌరవించి నడుచుకోవాలి అన్నారు.
బతుకమ్మ ఏర్పాట్లలో విఫలమై మహిళల ఆనందాన్ని హరించిన కమిషనర్ వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరల సత్యనారాయణ,కౌన్సిలర్ ఎస్.కె తాహెర్ పాషా, ఆకుల కవిత,మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు పెద్దపంగు స్వరూప, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బత్తుల రమేష్,బత్తుల జానీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.