ఎప్పుడూ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతూ ఉండే తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది అనుకుంటూ ఉండగా మళ్లీ పాత గ్రూపు రాజకీయాలు మెల్లి మెల్లి గా తెర పైకి వస్తున్నాయి.పార్టీలోని నేతలపై అనేక ఆరోపణలు, వివాదాలు చుట్టుముడుతున్నా, వారికి అండగా నిలబడి, వారి తరపున గొంతు పెంచి మాట్లాడేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది .
ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ విషయంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేయబోయి, సమంత ,నాగార్జున ,నాగచైతన్య( Samantha, Nagarjuna, Naga Chaitanya ) ల పేర్లను ప్రస్తావించడంతో కొండా సురేఖ చిక్కుల్లో పడ్డారు.
సురేఖ వ్యాఖ్యలను అందరూ తప్పు పట్టారు.
![Telugu Kondasurekha, Konda Surekha, Pccmahesh, Revanth Reddy, Telangana Cm-Polit Telugu Kondasurekha, Konda Surekha, Pccmahesh, Revanth Reddy, Telangana Cm-Polit](https://telugustop.com/wp-content/uploads/2024/10/Is-Konda-Surekha-lonely-in-Congressc.jpg)
ఈ వ్యవహారంలో నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా వేశారు .అయితే కొండా సురేఖకు( Konda Surekha ) మద్దతుగా తెలంగాణ మంత్రులు ఎవరు స్పందించకపోవడం , అంటీ ముట్టనట్లు గానే కాంగ్రెస్ నేతలు వ్యవహరించడంతో కొండా సురేఖ ఈ విషయంలో ఒంటరి అయినట్టే కనిపిస్తున్నారు .ఇది తమకు సంబంధం లేని వ్యవహారం అని, ఏదైనా అయితే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిలు చూసుకుంటారులే అన్నట్లుగా మిగతా సీనియర్ నేతలు , మంత్రులు సురేఖ విషయంలో వ్యవహరిస్తున్నట్లుగా అర్థం అవుతుంది .ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం సైలెంట్ అయ్యారు.అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి , శ్రీధర్ బాబు వంటి వారు ఈ మధ్యకాలంలో సైలెంట్ గానే ఉంటున్నారు .
![Telugu Kondasurekha, Konda Surekha, Pccmahesh, Revanth Reddy, Telangana Cm-Polit Telugu Kondasurekha, Konda Surekha, Pccmahesh, Revanth Reddy, Telangana Cm-Polit](https://telugustop.com/wp-content/uploads/2024/10/Is-Konda-Surekha-lonely-in-Congressb.jpg)
మొత్తం రేవంత్ రెడ్డి చూసుకుంటారులే అన్న అభిప్రాయంతో వారు ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.వీరే కాదు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )క్యాబినెట్ లో చాలామంది సీనియర్ నేతలు సైలెంట్ గా ఉంటున్నారు .భట్టి విక్రమార్క , తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు మాత్రమే కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారు ఇక కొండా సురేఖ వ్యవహారంలోనూ మిగిలిన మంత్రుల వ్యవహారం ఇలాగే ఉంది .రేవంత్ అన్ని చూసుకుంటారులే అన్న అభిప్రాయంతో వ్యవహరిస్తుండడంతో, పార్టీలో తాను ఒంటరి అయ్యాను అనే భావన సురేఖలోను కనిపిస్తోంది .బీఆర్ఎస్ సోషల్ మీడియాలో సురేఖను కించపరిచే విధంగా పోస్టింగ్ లు పెట్టినా కాంగ్రెస్ నేతలు పెద్దగా స్పందించలేదు .అదే సమయంలో బిజెపి ఎంపీ రఘునందన్ రావు ఈ వ్యవహారం పై కోర్టుకు వెళ్తానని సురేఖకు అండగా తాను నిలబడతానని చెప్పినా కనీసం మంత్రుల నుంచి సరైన మద్దతు సురేఖకు లభించలేదు.మంత్రి సీతక్క మినహా మిగిలిన మంత్రులు ఎవరూ కొండ సురేఖ విషయం లో పట్టించుకొనట్టుగానే వ్యవహరించారనే విషయం చర్చనీయాంసంగా ప్రస్తుతం మారింది.