మోస్ట్ పాపులర్ ఇండియన్ స్పైసెస్ లో మిరియాలు( Pepper ) ఒకటి.వంటల్లో మిరియాలను విరివిగా వాడుతుంటారు.
ఘాటైన రుచిని కలిగి ఉండే మిరియాలు ఫుడ్ టేస్ట్ మరియు ఫ్లేవర్ ను పెంచడంలో గ్రేట్ గా తోడ్పడతాయి.అలాగే మిరియాల్లో అనేక రకాల పోషకాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
అంతే కాదండోయ్ కురులకు అండగా ఉండే సత్తా కూడా మిరియాలకు ఉంది.ముఖ్యంగా మిరియాలను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే లాభాలే లాభాలు.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ లో గ్రైండ్ చేసుకున్న మిరియాల పౌడర్ వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు ( curd )మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ కి అప్లై చేసుకుని సున్నితంగా పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
ఆపై షవర్ క్యాప్ ధరించాలి.

40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ విధంగా కనుక మిరియాలను ఉపయోగిస్తే సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.మిరియాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు నెరిసే ప్రక్రియను ఆలస్యం చేస్తాయి.
తెల్ల జుట్టు త్వరగా దరిచేరకుండా అడ్డుకట్ట వేస్తాయి.అలాగే మిరియాలు తలలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.
జుట్టు పెరుగుదలకు మద్దతు ఇస్తాయి.

మిరియాలు యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ ( Anti-inflammatory )మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలు చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడతాయి.చుండ్రు సమస్యను దూరం చేస్తాయి.మిరియాలు జుట్టు కుదుళ్లలో లోతుగా పేరుకుపోయిన మురికి, ధూళి మరియు దుమ్మును తొలగిస్తాయి.
స్కాల్ప్ ను హెల్తీగా మారుస్తాయి.మిరియాల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
ఇక పెరుగులు తేనె కూడా జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి.కురులు స్మూత్ అండ్ సాఫ్ట్‌గా మెరిసేలా చేస్తాయి.