తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు.ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని కూడా వాళ్ళు షేక్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఇప్పుడు రామ్ చరణ్ శంకర్( ram charan, Shankar ) డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా డిసెంబర్ 20వ తేదీ నుంచి సంక్రాంతికి పోస్ట్ పోన్ అయినట్టుగా తెలుస్తుంది.ఇక సంక్రాంతి కానుక గా రావాల్సిన విశ్వంభర సినిమా సమ్మర్ కి పోస్ట్ పోన్ చేశారు.

మరి ఈ పోస్ట్ పోన్ల వెనక కారణం ఏంటి అంటూ చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి.ఇక మొత్తానికైతే తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి రామ్ చరణ్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇప్పుడు సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.అయితే డిసెంబర్ 6వ తేదీన పుష్ప 2 సినిమా( Pushpa 2 movie) వస్తున్న నేపథ్యంలోనే గేమ్ చేంజర్ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

మరి అందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలను పక్కన పెడితే గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన మరికొంత వర్క్ అయితే బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక దాని వల్లే మరొక పది రోజులు కావాలని ఆ సినిమాను పోస్ట్ పోన్ చేశారంటూ మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… చూడాలి మరి రామ్ చరణ్ సంక్రాంతి హీరోగా మారుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక గేమ్ చేంజర్ సినిమా సక్సెస్ అయితే మాత్రం పాన్ ఇండియా వైడ్ గా ఆయన మంచి హీరోగా గుర్తింపును సంపాదించుకుంటాడు.లేకపోతే మాత్రం ఆయన మరోసారి ఢీలా పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు…
.