చాలా రోజుల తర్వాత అసలు సిసలైన నక్సలిజం నేపథ్యంలో వచ్చిన విరాట పర్వం సినిమా ఇటీవలే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది అనే విషయం తెలిసిందే.వేణు ఊడుగుల దర్శకత్వంలో సాయి పల్లవి రానా హీరో హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది.పాజిటివ్ టాక్ వచ్చింది కానీ కమర్షియల్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది విరాట పర్వం సినిమా.1990 కాలంలో విప్లవభావాలు పై ఆకర్షితులై నక్సల్స్ ఉద్యమం లో చేరిన సరళ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.సరళ పాత్రను పోషించింది సాయి పల్లవి.అయితే సాయి పల్లవి కోసమే ఈ ఈ కథను రాశా అంటూ దర్శకుడు వేణు ఊడుగుల ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చాడు .
అయితే ఈ సినిమాలో రానా కామ్రేడ్ రవన్న పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.ఇక ఎప్పటి లాగానే పాత్రకు ప్రాణం పోసాడు రానా దగ్గుబాటి.
అయితే విరాటపర్వం సినిమాలో కామ్రేడ్ రవన్న పాత్రలో ముందుగా రానాను అనుకోలేదు.ఈ పాత్రలో గోపీచంద్ ఐతే బాగుంటుందని దర్శకుడు వేణు ఊడుగుల అనుకున్నాడట.
ఈ క్రమంలోనే ఈ కథను ముందుగా గోపీచంద్ కి వినిపించాడట.అయితే ఈ కథలో ఎక్కువగా హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత ఉండడంతో గోపీచంద్ నిర్మొహమాటంగా నో చెప్పేశాడట.
ఈ క్రమంలోనే ఈ పాత్రకు ఎవరైతే బాగుంటుందా అని వేణు ఊడుగుల ఆలోచించగా రానా అయితే సరిగ్గా సరిపోతాడని ఆలోచన వచ్చిందట.దీంతో ఇక రానాకు ఈ కథ వినిపించగా.రానా వెంటనే ఓకే చెప్పేశాడట.అయితే ఇక రానా విరాట పర్వం సినిమా ఒప్పుకున్న తర్వాత ఈ సినిమాలో నటించ వద్దు అంటూ ఎంతోమంది అభిమానులు సోషల్ మీడియాలో కోరారు.
ఈ సినిమా ఇప్పుడు కమర్షియల్ విజయాన్ని సాధించకపోవడంతో గోపీచంద్ ఈ సినిమాను వదులుకొని మంచి పని చేసాడు అంటూ అభిమానులు అనుకుంటున్నారట.ఇకపోతే ఇటీవల విరాట పర్వం సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటిటి వేదికగా విడుదల అయింది అన్న విషయం తెలిసిందే.