లాస్య మంజునాథ్( Lasya Manjunath ).అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు.
అదే.యాంకర్ లాస్య అంటే చాలు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఇట్లే గుర్తుపట్టేస్తారు.ఇదివరకు పలు టెలివిజన్ షోలలో ఆవిడ చేసిన సందడి అంతా ఇంతా కాదు.తనదైన పంచులతో ప్రజలను ఎంటర్టైన్ చేసేది లాస్య.ఆ తర్వాత కొన్ని పర్సనల్ కారణాల వల్ల బుల్లితెరకు దూరమైన ఆవిడ ఒక్కసారిగా బిగ్ బాస్ రియాల్టీ షోతో మారోమారు ముందుకు వచ్చింది.లాస్యకు ప్రేక్షకుల్లో పాజిటివిటీ ఎక్కువగా ఉండటంతో లాస్య బిగ్ బాస్ గేమ్ లో చాలా రోజులే గడిపింది.
బిగ్బాస్ సీజన్ ఫోర్ లో లాస్య 11 వ వారం ఎలిమినేట్ అయ్యింది.ఆ తర్వాత లాస్య తన యూట్యూబ్ ఛానల్ లో అనేక వీడియోలు చేస్తూ ప్రజాదరణ పొందింది.ఇకపోతే లాస్య వివాహం చేసుకున్నాక ఇద్దరి కుమారులకి జన్మనిచ్చింది.మంజునాథ్( Manjunath ) అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ లాస్య తెలిపింది.
ఇక మరోవైపు సోషల్ మీడియాలో లాస్య చాలా యాక్టివ్ గా ఉంటుంది.ఈ తరుణంలో తాజాగా లాస్య ఓ ఫోటో స్టూడియో ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
ఆ ఫోటో షూట్ లో చంకలో చంటి పిల్లాడిని పట్టుకొని ఇటుకలు మోస్తున్న విధంగా లాస్య దీనస్థితిని చూడడానికి చాలా నాచురల్ గా ఉంది.ఇక ఈ ఫోటోలను చూసిన సోషల్ మీడియా( Social media) వినియోగదారులు.అసలు లాస్యకు ఏమైంది ఇంతలా పరిస్థితి దిగజారిందని కొందరు కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే అయ్యో లాస్య ఏంటి నువ్వు ఇలా కనిపిస్తావని కలలో కూడా ఊహించలేదంటూ కామెంట్ చేస్తుండగా నిజానికి ఉమెన్ పవర్ గురించి తెలియజేసేది క్రమంలో భాగంగా దసరాను పునరస్కరించుకొని లాస్య ఈ ఫోటోషూట్ చేసింది.