సాధారణంగా కొందరి ఐబ్రోస్(కనుబొమ్మలు) చాలా ఒత్తుగా ఉంటాయి.కొందరికి మాత్రం పల్చగా ఉంటాయి.
అయితే ఒత్తైన ఐబ్రోస్ ముఖాన్ని మరింత అందంగా, ఆకర్షణీయంగా చూపిస్తాయి.కళ్లు ఏ ఆకారంలో ఉన్న సరే వాటిని అద్భుతంగా చూపించగలిగేవి ఒత్తైన కనుబొమ్మలే.
అందుకే ప్రతి అమ్మాయి ఒత్తైన ఐబ్రోస్ కోసం ఆరాటపడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ చిట్కాను మీరు తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే.ఈ చిట్కా మీ పల్చటి ఐబ్రోస్‌ను తక్కువ సమయంలోనే ఒత్తుగా, అందంగా మార్చేందుకు సహాయపడుతుంది.
మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా పది ఖర్జూరాలను తీసుకుని.
వాటిలో ఉండే గింజలను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని.
అందులో ఖర్జూరం గింజలను వేసి నల్లగా మారేంత వరకు వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న ఖర్జూరం గింజలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఖర్జూరం గింజల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, హాఫ్ టేబుల్ స్పూన్ ఉల్లిపాయ తురుము, ఐదు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో పెట్టి.
ఐదు నిమిషాల పాటు హీట్ చేయాలి.ఆపై హీట్ చేసుకున్న మిశ్రమాన్ని చల్లారబెట్టుకుని.
అప్పుడు పల్చటి వస్త్రం సాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్‌ను ఏదైనా బాటిల్‌లో నింపుకుని ఫిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.
రాత్రి నిద్రించే ముందు ఈ ఆయిల్‌ను ఇయర్ బడ్ సాయంతో ఐబ్రోస్‌పై అప్లై చేసుకోవాలి.ప్రతి రోజు ఈ ఆయిల్‌ను యూజ్ చేస్తే గనుక.
పల్చటి ఐబ్రోస్ కొద్ది రోజుల్లోనే ఒత్తుగా, అందంగా మారతాయి.