ఇదంతా ఎన్టీఆర్ వల్లనే సాధ్యం అయ్యిందా?

టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన సినిమాల కోసం నందమూరి అభిమానులంతా ఎదురు చూస్తూనే ఉంటారు.

 Alia Bhatt Ranbir Kapoor Brahmastra Advance Bookings Details, Rajamouli, Alia Bh-TeluguStop.com

ఈ మధ్యనే ట్రిపుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా హీరో అనిపించు కున్నాడు.ఇక ప్రెజెంట్ కొరటాల శివతో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.

ఇది ఇలా ఉండగా ఈయన ఈ మధ్య కాలంలో వేరే హీరోల సినిమాలకు ప్రొమోషన్స్ చేస్తూ వారికీ అండగా ఉంటున్నాడు.తాజాగా ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని ఈ సినిమాను ప్రోమోట్ చేసాడు.

ఈ సినిమా కొత్తగా ఉంటుంది అని.ప్రేక్షకులకు తప్పకుండ నచ్చుతుంది అని ఈ వేదికపై ఎన్టీఆర్ హామీ ఇచ్చాడు.

ఎన్టీఆర్ ప్రొమోషన్స్ ఈ సినిమాకు వర్క్ ఔట్ అయినట్టే కనిపిస్తుంది.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కూడా ప్లాప్ అయితే పరిస్థితి ఏంటి అనే సందేహం అందరిలో కలుగుతుంది.ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అంతటా ఈ సినిమాను జనాలు ఎలా ఆదరిస్తారు అనే సందేహం ఉంది.

Telugu Advance, Alia Bhatt, Bollywood, Brahmastra, Rajamouli, Ranbir Alia, Ranbi

ఇదే సమయంలో సౌత్ లోని నాలుగు భాషల్లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడంతో ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లేందుకు రాజమౌళి ప్రొమోషన్స్ చేస్తున్నారు.దీంతో రాజమౌళి ఎన్టీఆర్ ను రంగంలోకి దించడంతో మన తెలుగులో కాస్త బజ్ తెచ్చుకుంది.అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యింది.

బుకింగ్స్ బాగా జరుగుతున్న నేపథ్యంలో ఈ క్రెడిట్ అంతా ఎన్టీఆర్ కే దక్కుతుంది అనడంలో సందేహం లేదు.అలాగే రిలీజ్ తర్వాత మంచి టాక్ వస్తే ఈ సినిమా వసూళ్లు బాగానే రాబట్టే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కూడా కీలక పాత్రలలో నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube