ఒక సినిమా మీద కథ సమయంలో సగం.స్క్రిప్ట్ వరకు వచ్చే సరికి పూర్తిగా ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉంది.
దర్శక నిర్మాతలో పాటు హీరోకు కూడా ఈ సినిమా హిట్ అవుతుందో.? ఫట్ అవుతుందో? కాస్త అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది.కొన్నిసార్లు సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఔట్ ఫుట్ వచ్చినప్పుడు కూడా అంచనాలు మారే అవకాశం ఉంటుంది.ఫైనల్ ఔట్ ఫుట్ తర్వాత సినిమా ఏమవుతుందో ఈజీగా చెప్పవచ్చు.
దర్శక, నిర్మాతలు అందుకు సిద్ధపడి ఉంటారు కూడా.అయితే కొన్నిసార్లు సినిమా విడుదల అయ్యాక పరిస్థితులు మారిపోతాయి.
అంచనాలు తప్పి ఘన విజయం సాధించిన సినిమాలుండగా.మరికొన్ని డిజాస్టర్లుగా మారిన సినిమాలూ ఉన్నాయి.అలా బాలయ్య కెరీర్ లో అంచనాలు తప్పిన సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జననీ జర్మభూమి
బాలకృష్ణ, సుమలత నటించిన ఈ సినిమా 1984లో విడుదల అయ్యింది.యాక్షన్ డ్రామా ఎంటర్ టైనర్ గా విడుదల అయిన ఈ సినిమాలో రాజ్యలక్ష్మి, కైకాల సత్యనారాయణ, శారధ, పి జె సర్మ, సాక్షి రంగా రావు, రమ ప్రభ సహా పలువురు దిగ్గజ నటులున్నా.
కత్తుల కొండయ్య
బాలకృష్ణ, సుమలత కలిసి నటించిన ఈ సినిమా 1985లో విడుదల అయ్యింది.ఎస్ బి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్, గుమ్మడి, మారూతి రావు, సిల్క్ స్మిత తదితరులు నటించారు.
అల్లరి కృష్ణయ్య
నందమూరి రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య, భానుప్రియ కలిసి నటించారు.1987లో రిలీజ్ అయిన ఈ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ గా తెరెక్కింది.అయినా జనాలను ఆకట్టుకోలేకపోయింది.
సాహస సామ్రాట్
1987లో విడుదల అయిన ఈ సినిమాలో బాలయ్య, విజయశాంతి నటించారు.కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
ప్రాణానికి ప్రాణం
1990లో రిలీజ్ అయిన ఈ సినిమాలో హీరోయిన్ గా రజినీ నటించింది.చలసాని రామారావు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ జనాలను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.బ్రహ్మార్షి విశ్వమిత్ర
1991లో వచ్చిన ఈ సినిమాకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో బాలయ్య, ఎన్టీఆర్ కలిసిన నటించారు.బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా విఫలం అయ్యింది.
గాండీవం
1994లో వచ్చిన ఈ సినిమాలో బాలయ్యకు తోడుగా రోజా నటించింది.ఈ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు.జనాలను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.
నిప్పు రవ్వ
1993లో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య, విజయశాంతి నటించారు.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
దేవుడు
1997లో విడుదల అయిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా రమ్య క్రిష్ణ నటించింది.రవిరాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
కృష్ణ బాబు
1999లో విడుదల అయిన ఈ సినిమాలో బాలకృష్ణ, మీనా నటించారు.ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా సరిగా ఆడలేకపోయిందివంశోద్ధారకుడు, పలనాటి బ్రహ్మానాయుడు, వీరభద్ర, శ్రీమన్నారాయణ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.