అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. కమలా హారిస్ కోసం ఏఆర్ రెహమాన్?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు( US presidential election ) సమయం దగ్గరపడుతోంది.ఉన్న ఈ కాస్త టైంలో ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు రిపబ్లికన్లు, డెమొక్రాట్లు పావులు కదుపుతున్నారు.

 A R Rahman To Do Live Music Concert For Kamala Harris, Organized By The Aapi Vic-TeluguStop.com

ప్రచార వ్యూహాలను కొత్త పుంతలు తొక్కించడంతో పాటు టీవీ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అధ్యక్ష అభ్యర్ధులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌( Donald Trump and Kamala Harris ).అంది వచ్చిన ఏ అవకాశాన్ని వీరిద్దరూ విడిచిపెట్టడం లేదు.అయితే ట్రంప్‌తో పోలిస్తే నిధుల సేకరణలో దూసుకెళ్తున్నారు కమలా హారిస్.అధ్యక్ష అభ్యర్ధిగా అధికారికంగా బరిలో నిలిచిన నాటి నుంచి నేటి వరకు ఆమె 1 బిలియన్ డాలర్లకు పైగా విరాళాలు సేకరించినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

Telugu Ar Rahman, Aapi Victory, Donald Trump, Kamala Harris, Presidential-Telugu

తాజాగా కమలా హారిస్ కోసం ‘ ది ఏషియన్ అమెరికన్ పపిషిక్ ఐ లాండర్స్ ( AAPI Victory Fund )’ (ఏఏపీఐ) నిధుల సేకరణ, ప్రచారానికి భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది.కమలా హారిస్ కోసం ఏర్పాటు చేస్తున్న ఈ సభలో భారత దిగ్గజ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్( A R Rahman ) కచేరి ఉంటుందని సంస్థ తెలిపింది.అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై ఎలాంటి అధికారిక సమాచారాన్ని ఏఏపీఐ వెల్లడించలేదు.ఏఆర్ రెహమాన్ సైతం దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Telugu Ar Rahman, Aapi Victory, Donald Trump, Kamala Harris, Presidential-Telugu

కాగా.కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌( Donald Trump , Kamala Harris)లలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరు అంటూ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.అమెరికా పోల్ నోస్ట్రాడామస్‌గా గుర్తింపు తెచ్చుకున్న చరిత్రకారుడు అలన్ లిచ్ట్‌మన్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.డొనాల్డ్ ట్రంప్‌పై కమలా హారిస్ విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.77 ఏళ్ల లిచ్ట్‌మన్ సీఎన్ఎన్‌కు చెందిన మైఖేల్ స్మెర్‌కోనిష్‌కి ఈ విషయం ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.గడిచిన కొన్ని దశాబ్ధాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు లిచ్ట్‌మాన్ జోస్యానికి దగ్గరగా వచ్చాయి.

దీంతో ఆయనను ‘ నోస్ట్రాడమస్ ఆఫ్ యూఎస్ ప్రెసిడెంట్ పోల్స్’గా అభివర్ణిస్తారు.ఒక్క 1984 అమెరికా అధ్యక్ష ఎన్నికలు తప్పించి మిగిలిన అన్నిసార్లు ఆయన చెప్పిన జోస్యాలు ఫలించాయి.2024 అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముందు చివరి నెల గేమ్‌ ఛేంజర్‌గా మారుతుందని ఆయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube