రతన్ టాటా( Ratan Naval Tata ) యుక్త వయసులో అంటే 1961-62 కాలంలో ఒక అమెరికన్ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు.ఆమె కూడా అతడిని ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది.
ఇక ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే సమయంలోనే రతన్ టాటా నాయనమ్మ జబ్బున పడింది.ఆమె రతన్ టాటా ని పెంచి పెద్ద చేసింది అందుకే రతన్ ఆమెను చూసుకోవడానికి అమెరికా నుంచి ఇండియా వెళ్లిపోయాడు అదే సమయంలో ఇండియా చైనా మధ్య యుద్ధం జరుగుతోంది.
అయితే రతన్ ఆమెను పెళ్లి చేసుకుందామనుకున్నాడు కాబట్టి భారతదేశానికి రమ్మన్నాడు.
అయితే అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు యుద్ధం జరుగుతోంది కాబట్టి భయపడి ఆమెను వెళ్లొద్దని చెప్పారు తర్వాత ఆమె ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఈ విషయాన్ని రతన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.అమెరికాలో గొప్ప చదువు చదివారు రతన్.ఆయనకు అపారమైన సంపద ఉంది.
ఆరడుగుల అందగాడు.పైగా మంచివాడు జెంటిల్మెన్.
ఆయన ట్రై చేయకపోయినా హైప్రొఫైల్ లేడీస్ ఆయన వెంట పడటం సహజం.వ్యాపారంలో బిజీగా ఉన్నప్పుడు అమెరికా అమ్మాయి కాకుండా ముగ్గురు అతని ప్రేమలో పడ్డారు.
వారిని రతన్ టాటా కూడా ఇష్టపడ్డారు.ఆ ముగ్గురితో స్టార్ట్ చేసిన ప్రేమ అనేది పెళ్లి దాకా కూడా వెళ్ళింది.
ఈ విషయాన్ని ఆయనే తెలిపారు.
సినిమా నటి, హైఫై సొసైటీలో పెరిగిన సిమి గరేవాల్( Simi Garewal ), రతన్ టాటా చాలా రోజులు డేటింగ్ కూడా చేశారట.సిమి 2011లో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.అప్పట్లో ఆమె చాలా అందంగా ఉండేవారు యువతకు డ్రీమ్ గర్ల్ గా నిలిచారు.
రతన్ టాటా కూడా ఆమె ఆకర్షణలో పడిపోయి, ఆమెతో ప్రేమాయణం నడిపించారు.ఆమెకు 76 ఏళ్లు.
రతన్ టాటా చనిపోయారని తెలిసాక చాలా ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టారు.సిమి గరేవాల్ ఓ ఆర్మీ అధికారి కూతురు.
బ్రిటన్‌లో విద్యాభ్యాసం చేశారు.అప్పట్లో కొన్ని సినిమాల్లో హాఫ్ నేకెడ్గా నటించి విమర్శల పాలయ్యారు.
ఒక రతన్ టాటా తో మాత్రమే కాదు జామ్‌నగర్ మహారాజాతో కొన్నేళ్లు, ఆపై రవి మోహన్‌తో కొన్నేళ్లు అఫైర్ పెట్టుకున్నారు.క్రికెటర్ పటౌడీ, రాజకపూర్, పాకిస్థానీ వ్యాపారి సల్మాన్ తసీర్ వంటి వారితో కూడా ఆమె లవ్ అఫైర్ కొనసాగించినట్లు సమాచారం.
చివరికి రవి మోహన్‌ను పెళ్లి చేసుకొని ఆపై విడాకులు తీసుకున్నారు.అమెరికా ప్రియురాలు, సిమి గరేవాల్ గురించి అందరికీ ఇప్పుడు తెలిసింది కానీ రతన్ టాటా అఫైర్ నడిపిన మిగతా ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు అనేదే ఇప్పుడు మిస్టరీగా మారింది.
రతన్ చాలా ప్రైవేట్ వ్యక్తి.వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ, ఎవరితోనూ మాట్లాడరు.
ఆయన రిలేషన్ షిప్స్ చాలా సీక్రెట్ గా ఉంటాయి.ఇతర సెలబ్రిటీ అస్సలు రూమర్స్ లో నిలబరు.