ఆటో డ్రైవర్ గా పని చేస్తూ నటుడిగా ఎదిగాడు..ఈయన భార్య కూడా స్టార్ యాక్ట్రెస్

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన నలుగురిని చూసి మనం కూడా ఇండస్ట్రీకి పోయి ఏదో ఒకటి చేసి మనం కూడా సక్సెస్ ఫుల్ పర్సన్ అనిపించుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది.

కానీ అక్కడ 100 మందిలో ఒక్కడు మాత్రమే సక్సెస్ అయితే మిగిలిన 99 మంది ఏం చేయాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక సందిగ్ధావస్థలో ఉంటారు అలాంటి వారు చాలామంది ఇండస్ట్రీకి వచ్చి వెళ్ళి పోతూ ఉంటే కానీ కొందరు మాత్రం ఇక్కడ ఏదో ఒకటి సాధించి స్థిరంగా ఉండడానికి ఇష్టపడతారు.

ఒకప్పుడు చెన్నై ట్రైన్ ఎక్కి వెళ్ళిన చాలామంది ఆర్టిస్టులు వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని నటుడిగా ఇండస్ట్రీలో చలామణి అయ్యారు కానీ.వాళ్ల లో నందమూరి తారక రామారావు, నాగేశ్వర్ రావు, కృష్ణ ,శోభన్ బాబు లాంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు అయితే వీళ్ళు అందరూ వాళ్ల వాళ్ల నటనతో స్టార్ హీరోలు అయ్యారు అయితే వీళ్లతో పాటు లైఫ్ స్టార్ట్ చేసిన చాలామంది వెనక్కి తిరిగి వెళ్లిపోయారు కారణం ఏంటంటే ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ అందుకునే వారు మాత్రం కొందరే ఉంటారు.

వీళ్ల తరువాతి తరంలో అలాగే పేదరికం నుంచి మన ఏదో ఒకటి సాధించాలి అని దృఢసంకల్పంతో ఇక్కడే ఉండి అహర్నిశలు కష్టపడి ఒక స్టార్ గా ఎదిగిన వాళ్ళ లో చిరంజీవి ఒకరు.ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరంజీవి ఆ తర్వాత వరుసగా బాక్సాఫీస్ హిట్స్ కొడుతూనే ఉన్నారు.

చిరంజీవి మధ్యలో రాజకీయాలు లాంటి వాటికి వెళ్లిన మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఖైదీ నెంబర్ 150 తో బాస్ ఇస్ బ్యాక్ అనిపించుకున్నారు.

Advertisement

వీళ్లందరి లాగే బోస్ వెంకట్ కూడా ఇండస్ట్రీ కి వచ్చాడు.ఈయన తమిళనాడు లోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు ఆయనకు సినిమా మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేయాలి మనలోని టాలెంట్ ని మనం గుర్తిస్తేనే మనల్ని జనాలు గుర్తిస్తారు అనుకొని మనం ఎలాగైనా ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుని చెన్నై వచ్చి అవకాశాల కోసం చుట్టూ తిరిగే వాడు బోస్ వెంకట్ అయితే వాళ్ల ఫ్యామిలీ కూడా పేదరికం నుంచి వచ్చింది కాబట్టి సాయంత్రం టైంలో ఆటో నడుపుతూ పొద్దున టైం ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు.ఆయన పని చేస్తూ వచ్చిన డబ్బులో సగం ఇంటికి పంపుతూ మిగిలిన సగం తో ఇక్కడే ఒక రోజు రెండు రోజులు ఉపవాసం ఉంటూ గడిపాడు మార్నింగ్ టైం లో మాత్రం ప్రతిరోజు ఆఫీసుల చుట్టూ ఫోటోలు పెట్టుకొని కాళ్లు అరిగేలా తిరిగేవారు అయితే భాగ్యరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఒక సినిమాలో బోస్ వెంకట్ కి మంచి వేషం ఇచ్చారు.

ఆ తర్వాత తను చాలా సినిమాల్లో నటించాడు సోనియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు.సోనియా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా చేయడం స్టార్ట్ చేసి ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది.

అయితే బోస్ వెంకట్ సౌత్ ఇండియ టాప్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వం లో వచ్చిన శివాజీ సినిమాలో విలన్ గా నటించిన సుమన్ పక్కన ఉండే విలన్ గా మంచి క్యారెక్టర్ చేశారని చెప్పాలి.

ఆ తర్వాత చాలా సినిమాల్లో చేసినప్పటికీ శివాజీ సినిమాలో మాత్రం చేసిన క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి.శివాజీ సినిమా సౌత్ ఇండియా లో మొట్టమొదటి 100 కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డులకెక్కింది ఆ సినిమాలో ప్రతి ఒక్కటి అద్భుతమే రెహమాన్ మ్యూజిక్ ఒక పెద్ద ప్లస్ పాయింట్ కాగా శంకర్ దర్శకత్వం ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.రజినీకాంత్ స్టైల్ గాని యాక్టింగ్ లో గాని భాష తర్వాత అంత పర్ఫెక్ట్ గా చేసిన సినిమా శివాజీ సినిమా అని చెప్పాలి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అయితే బోస్ వెంకట్ సినిమాల్లోనే కాకుండా చాలా సీరియల్స్ లో కూడా నటించాడు.ఎక్కడో పల్లెటూరి నుంచి వచ్చిన వెంకట్ ఇండస్ట్రీలో ఒక మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందాడు.

Advertisement

ఆ తరువాత బుల్లితెరపై కూడా అనేక సీరియల్స్ లో ప్రేక్షకులను అలరిస్తూ అందరి మన్ననలు పొందిన నటుడిగా ప్రశంసలు అందుకున్నారు.ఇండస్ట్రీలో ఒక హిట్ ఉంటే పది సినిమాల్లో అవకాశం వస్తుంది అది ఒక ఫ్లాప్ ఉంటే ఒక సినిమాలో కూడా అవకాశం రాదు.

తాజా వార్తలు