వారంలో రెండు సార్లు ఈ చిట్కాను పాటిస్తే మేకప్ అక్కర్లేదు సహజంగానే తెల్లగా మెరుస్తారు!

సాధారణంగా చాలా మంది తమ ముఖ చర్మాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీములను వేలకు వేలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసి వాడుతుంటారు.

 Follow This Tip Twice A Week For A Naturally White Glow! Skin Whitening Remedy,-TeluguStop.com

అలాగే తోచిన రెమెడీలు ప్రయత్నిస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే చిట్కాను మీరు పాటించాల్సిందే.వారంలో రెండంటే రెండు సార్లు ఈ చిట్కాను ప్రయత్నిస్తే మేకప్ కూడా అక్కర్లేదు.

సహజంగానే తెల్లగా మరియు కాంతివంతంగా మెరుస్తారు.మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఒక కప్పు కొబ్బరి ముక్కలు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి వేసుకోవాలి.చివరిగా సరిపడా క్యారెట్ జ్యూస్ ను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసి కనీసం ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఈ చిట్కాను క‌నుక పాటిస్తే చర్మం సహజంగానే తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.

మొండి మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా మాయం అవుతాయి.అలాగే చ‌ర్మం స్మూత్ అండ్ షైనీగా సైతం మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube