ఇదే తగ్గించుకుంటే బాగుంటుంది.. ఓవరాక్షన్ చేసిన పరాగ్

బుధవారం నాడు టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండవ టీ 20 సిరీస్ జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఈ మ్యాచ్లో బాంగ్లాదేశ్ జట్టు( Bangladesh ) పై 86 పరుగుల తేడాతో ఇండియా( India ) భారీ విజయం సొంతం చేసుకుంది.

 Riyan Parag Bowling Sparks Social Media Details, Riyan Parag ,bowling ,social M-TeluguStop.com

ఈ మ్యాచ్ లో భాగంగా నితీష్ కుమార్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు.ఈ మ్యాచ్లో నితీష్ కుమార్ బ్యాటింగ్, బౌలింగ్ లో బాగా ప్రదర్శన చేశాడు.

అయితే ఈ మ్యాచ్లో ఒక అరుదైన సంఘటనకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

Telugu Buzz, Riyan Parag, Riyanparag, Latest-Latest News - Telugu

టీమ్ ఇండియాలో ఇటీవలే చోటు సొంతం చేసుకున్న ఆల్ రౌండర్ రియాన్ పరాగ్( Riyan Parag ) కాస్త ఓవరాక్షన్ చేసినట్లుగా కనపడ్డాడు.బౌలింగ్ వేస్తున్న సమయంలో బౌలింగ్( Bowling ) కాస్త వెరైటీగా చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.అయితే ఆ బాల్ నో బోల్ వేసి అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేశాడు.

ఈ సంఘటన బంగ్లాదేశ్ బ్యాటింగ్లో 11 ఓవర్ లో జరిగింది 11 ఓవర్ లో బాలు వేయడానికి వచ్చిన పరాగ్ బంగ్లాదేశ్ బాటర్ మహమ్మదుల్లాను ఇబ్బంది పెట్టేందుకు వెరైటీగా బౌలింగ్ చేయాలనే అనుకున్నాడు… ఈ క్రమంలో వికెట్ కు దూరంగా నడుచుకుంటూ వచ్చి బాలు సందించాడు.

Telugu Buzz, Riyan Parag, Riyanparag, Latest-Latest News - Telugu

అది గమనించిన అంపైర్ వెంటనే నోబాల్ గా ప్రకటించాడు.దీంతో రియాన్ పరాగ్ ప్లాన్ కాస్త దెబ్బతినింది.అంతే కాకుండా టీం ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు కూడా కోపం వచ్చింది.

అంతేకాకుండా టీం ఇండియా ప్లేయర్లు అందరూ కూడా ఇంత ఓవరాక్షన్ ఎందుకు అన్నట్టు పరాగ్ వైపు చూసినట్లు మనం చూడవచ్చు.ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ మ్యాచ్ లో భాగంగా మొదటి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా జట్టు 221 పరుగులు తీయగా.బంగ్లాదేశ్ జట్టు 135 పరుగులు చేసింది.దీంతో టీమిండియా 2-0 టి20 సిరీస్ ను సొంతం చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube