యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తారక్ ( Tarak )చేసిన కొన్ని కామెంట్లు ఒకింత సంచలనం అవుతున్నాయి.తారక్ చేసిన కామెంట్లు నిజమేనని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఈరోజుల్లో మనం చాలా నెగిటివ్ అయిపోయామని ఆయన అన్నారు.ఒక సినిమాను అంచనాలు లేకుండా నార్మల్ గా చూడటం మానేశామని తారక్ పేర్కొన్నారు.
ఇంట్లో మా పిల్లలు సినిమాను చూసి ఆ సినిమాను ఎంజాయ్ చేస్తారని మనం మాత్రం అలా సినిమాలు చూడటంలో ఫెయిల్ అవుతున్నామని కామెంట్లు చేశారు.ఈరోజుల్లో ప్రతి సినిమాను విశ్లేషించడం కోసమే చూస్తున్నామని సినిమాలను జడ్జ్ చేయడం, విశ్లేషించడం, అతిగా ఆలోచించడం లాంటివి అదే పనిగా చేస్తున్నామని తారక్ తెలిపారు.
ప్రేక్షకుల మైండ్ సెట్ సాధారణ స్థితికి వచ్చి నార్మల్ గా సినిమా చూసే రోజులు కూడా వస్తాయంటూ తారక్ పేర్కొన్నారు.సినిమాపై ప్రేమ మనల్ని ఈ విధంగా తయారు చేసిందేమో అని తారక్ తెలిపారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పింది నిజమేనని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.ఒకప్పుడు సినిమా చూసిన విధానానికి ఇప్పుడు సినిమా చూసే విధానానికి మార్పు వచ్చిందని వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం పెద్ద సినిమాలకు బడ్జెట్, కలెక్షన్లు ఫలితాల విషయంలో కీలకమయ్యాయి.ఇండస్ట్రీలో మార్పు వస్తే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉంటాయి.జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలు భారీ రేంజ్ లో నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.తారక్ భిన్నమైన సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ సైతం ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.